న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం నిర్మూలనకు బడ్జెట్లో ఎలాంటి వ్యూహాత్మక ఆలోచనలను చేయలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. యువత ఉద్యోగ అవకాశాలు పెంచేందకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పకపోవడం బాధాకరమని ఆయన చెప్పారు. లోక్‌సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ బడ్జెట్‌పై స్పందించారు. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంతో దేశానికి ఒరిగిందేలేదని రాహుల్ పేర్కొన్నారు.