Take a fresh look at your lifestyle.

విమర్శలను తిప్పికొట్టలేని కాంగ్రెస్‌ ‌పార్టీ …!

‘పాకిస్తాన్‌ ‌విషయంలో భారత్‌ ‌జోక్యం చేసుకుంటే, అమెరికా చూస్తూ ఊరుకోదు. గుణపాఠం చెబుతుంది•-‘రిచర్డ్ ‌నిక్సన్‌

 ‘అమెరికాను భారత్‌ ‌మిత్ర దేశంగా పరిగణిస్తోంది. మేము ఎవరికీ గులామ్‌ ‌కాదు. మా గమ్యం ఏమిటో మాకు తెలుసు . దానిని సాధించుకునే శక్తియుక్తులు మాకు ఉన్నాయి. ఎవరితో ఎలా  మసులుకోవాలో  మాకు బాగా తెలుసు. పరిస్థితులను బట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా తెలుసు.’  ఇందిరాగాంధీ

1971 సంవత్సరంలో నవంబర్‌ ‌నెలలో ఇందిరాగాంధీ వైట్‌ ‌హౌస్‌ ‌లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ‌నిక్సన్‌ను కలుసుకుని ముఖాముఖీ చర్చలు జరిపినప్పుడు అన్న మాటలివి. ఈ వివరాలను ఆనాటి అమెరికా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు హెన్రీ కిసెంజర్‌ ‌తన స్వీయ చరిత్రలో ఈ మాటలు రాసుకున్నారు., ఆరోజు ఇరుదేశాల అధినేతలు సంయుక్తంగా పత్రికాగోష్టిని నిర్వహించాల్సి ఉంది. కానీ, ఇందిరాగాంధీ తనదైన శైలిలో వైట్‌ ‌హౌస్‌ ‌నుంచి బయటకు వచ్చేశారు.కిసెంజర్‌ ఇం‌దిరాగాంధీ కారులో ప్రవేశిస్తూ  మేడమ్‌ ‌ప్రైమ్‌ ‌మినిస్టర్‌ , ‌మా అధ్యక్షునితో మీరు కాస్తంత ఓరిమితో వ్యవహరించి ఉండాలని అనిపించలేదా..!  మిస్టర్‌ ‌కిసెంజర్‌, ‌మీ విలువైన సలహాకు థ్యాంక్స్ . ‌మాది అభివృద్ది చెందిన దేశం,. మా బలం మేమిటో మాకు తెలుసు. మాపై ఎవరు దాడి చేసినా కాచుకునే శక్తి మాకుంది. అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడే సామర్ధ్యం మాకు ఉంది. సమయం వచ్చినప్పుడు మా సామర్ధ్యాన్ని రుజువు చేసుకుంటాం.. అని ఆమె సమాధానమిచ్చారు.

ఆ తర్వాత ఎయిర్‌ ఇం‌డియా విమానంలో ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగగానే, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు అటల్‌ ‌బిహారీ వాజ్‌ ‌పేయిని తన నివ సానికి వెంటనే ఆహ్వానించారు . ఆయనతో గంటసేపు ముఖాముఖీ మాట్లాడారు. ఆ తర్వాత వాజ్‌ ‌పేయి హడావుడిగా బయటికి వచ్చేశారు. ఆ తర్వాత తెలిసింది, ఐక్యరాజ్య సమితిలో వాజ్‌ ‌పేయి భారత్‌ ‌తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్న సంగతి.వెంటనే  బీబీసీ విలేఖరి డొనాల్డ్ ‌పౌల్‌ ‌వాజ్‌ ‌పేయిపై ప్రశ్నలు కురిపించారు. ఇందిరాజీ మిమ్మల్ని గట్టి విమర్శకునిగా భావిస్తారు. అయినప్పటికీ, ఐక్యరాజ్య సమితిలో రానున్న ప్రభుత్వం తరఫున మీ వాణిని వినిపించబోతున్నారని అన్నారు.వాజ్‌ ‌పేయి  ఇచ్చిన సమాధానంలో ఆయన కవితా హృదయం తొంగి చూసింది. గులాబీ ఒక తోటలో వికసిస్తుంది. అదే తోటలో లిల్లీ పూవు కూడా వికసిస్తుంది. వ్యక్తిగతంగా వేటికవే పరిమళాలను వెదజల్లినా పూలతోట ప్రమాదంలో పడినప్పుడు, తోటను కాపాడాల్సిన బాధ్యత తోటమాలిదే,. ఇందులో రహస్యం ఏమీ లేదు. నేను తోటను కాపాడటానికి వచ్చాను. భారతీయ ప్రజాస్వామ్యం ఔన్నత్యం ఇదే. అని వాజ్‌ ‌పేయి సమాధానమిచ్చారు.

ఆ తర్వాత జరిగిన చరిత్ర ఏమిటో అందరికీ తెలుసు.అమెరికా  పాకిస్తాన్‌ ‌కు 270 పాటన్‌ ‌ట్యాంకులను పంపింది. ఈ ట్యాంకులను ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినవని అమెరికన్‌ ‌ప్రభుత్వం చెప్పింది. అమెరికా చర్య ఉద్దేశ్యం ఏమిటో అందరికీ తెలుసు. భారత్‌ ‌కు  ఏ ఒక్కరూ సాయపడకూడదని. అమెరికా అక్కడితో ఆగలేదు.బర్మా- షెల్‌ …అప్పట్లో భారత్‌ ‌కు అమెరికా చమురు సరఫరా చేసే కంపెనీ ఒక్కటే. ఆ కంపెనీతో అమెరికా చాలా నిర్మొహమాటంగా చెప్పింది. భవిష్యత్‌ ‌లో భారత్‌ ‌తో ఒప్పందాలు కుదుర్చుకోవద్దని.

ఆ తర్వాత భారత చరిత్ర చూస్తే, అంతా పోరాటమే.ఇందిరాగాందీ  అంత నిర్మొహమాటంగా వ్యవహరించారు. ఆ తర్వాత యుక్రేయిన్‌ ‌నుంచి  భారత్‌ ‌కు చమురు దిగుమతి అయింది.ఆ తర్వాత జరిగిన యుద్దంలో 270 పాటన్‌ ‌ట్యాంకుల ను  భారత్‌ ఒక్కరోజులో ఛేదించింది.అమెరికా ఘనతనూ,ప్రాభవాన్నీ నేలరాసిన భారత శౌర్య పరాక్రమాలకు  రాజస్థాన్‌ ‌లోని ఎడారి ప్రాంతం ఇప్పటికీ సాక్షీ భూతంగా నిలుస్తోంది.

18 రోజుల పాటు జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దారి తీసింది. పాకిస్తాన్‌ ‌నుంచి 1.5 లక్షల మంది యుద్ధ ఖైదీలు విడుదల య్యారు. షేక్‌ ‌ముజిబార్‌ ‌రెహమాన్‌ ‌లాహోర్‌ ‌జైలు నుంచి విడుదల అయ్యారు. ఆ ఏడాది మార్చి నెలలో  భారత పార్లమెంటులో ఇందిరాగాంధీ  బంగ్లా దేశ్‌ ఆవిర్భావం గురించి ప్రకటించారు. వాజ్‌ ‌పేయి పార్లమెంటులో ప్రసంగిస్తూ ఇందిరాగాంధీని దుర్గా మాతగా అభివర్ణించారు. ఈ సంఘటనలతో కొన్ని శాశ్వత పరిష్కారాలు, సంస్థల ఏర్పాటుకు దారి తీశాయి. ఇండియా సొంతంగా చమురు కంపెనీని-

1.ఇండియన్‌ ఆయిల్‌ ‌కార్పొరేషన్‌ ‌ను ఏర్పాటు చేసుకుంది .
2.ఇండియా  శక్తిసామర్ధ్యాలేమిటో  ప్రపంచ దేశాలకు తెలిశాయి.
3.అలీన ఉద్యమానికి భారత్‌ ‌నేతృత్వం వహించింది.
4.భారత్‌ ‌కు తిరుగులేని నాయకత్వం లభించింది.

స్వాతంత్రోద్యమంలో అగ్రభాగాన నిలిచిన కాంగ్రెస్‌ ‌పార్టీ తదనంతరం దేశ నిర్మాణంలో, జాతి సమైక్యతలో ఏ నాడు రాజీ పడలేదు అన్న దానికి ఇదొక ఉదాహరణ మాత్రమే ..! భారత దేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో కాంగ్రెస్‌ ‌పార్టీ డే ప్రధాన భూమిక .. జవహర్లాల్‌ ‌మొదలు డా. మన్మోహన్‌ ‌సింగ్‌ ‌వరకు దేశ పురోగతికి , అభ్యున్నతికి ఎనలేని సేవలందించారన్నది నిర్వివాద అంశం. ప్రజాస్వామ్య విలువలకు ఆ పార్టీ పెద్ద పీఠ వేసింది . ప్రతిపక్ష పార్టీలకు సముచిత స్థానాన్ని గుర్తించింది . ప్రస్తుత రాజకీయాల్లో ఆ విలువలు ..సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి ..కాంగ్రెస్‌ ‌పార్టీ 70 సంవత్సరాల పాలనపై తమ రాజకీయ మనుగడ కోసం కొందరు చేస్తున్న విమర్శలను ఆ పార్టీ సమర్ధవంతంగా తిప్పికొట్టలేక పోతున్నది ..కాలం,ఘటనలు గతకాలపు జ్ఞాపకాల్లో కూరుకుని పోవు. చరిత్ర ఎప్పటికీ చరిత్రగానే నిలుస్తుంది.ఇండియా సామర్ధ్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసి అర్ధ శతాబ్ది అయింది.అభివృద్ధి చెందుతున్న దేశంగా ఐదు దశాబ్దాల క్రితమే తన సామర్ధ్యాన్ని భారత్‌ ‌రుజువు చేసుకుంది. అప్పట్లో అధికార, ప్రతిపక్షాలు దేశం కోసం ఏకతాటిపై ఎలా నిలబడ్డాయో రుజువు చేస్తున్నాయి ఈ సంఘటనలు. అటువంటి గుణపాఠాలు పునరావృతం కావాలి…
-శ్యామ్‌

Leave a Reply

error: Content is protected !!