Take a fresh look at your lifestyle.

ఆస్తిపన్ను పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ‌ధర్నా

Congress opposes increase in property taxహన్మకొండ: నూతన ఆంగ్ల సంవత్సరంలో నగర ప్రజలకు కానుకలు బదులుగా మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కన్నీరిచ్చిందని ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ‌పెంపుపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ కాజీపేట మున్సిపల్‌ ‌కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ర్యాలీగా మున్సిపల్‌ ‌కార్యాలయం వరకు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ ‌నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజామోదం లేకుండానే ప్రజలపై అస్తి పన్ను భారాన్ని గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌ప్రజలపై మోపిందని, అభివృద్ధిని మరచి ఆదాయం కోసం ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. ఏం అభివృద్ధి చేశారని పన్నులు పెంచారని, నగరంలో సౌకర్యాలు కల్పించడానికి మాత్రం ముందుకు రాని కార్పొరేషన్‌ ‌వసూలు చేయడానికి రెడీగా ఉందన్నారు.

నాణ్యమైన రోడ్లకు దిక్కు లేదని, పరిశుభ్రత ఎన్నడూ పట్టించుకోలేదని, వాడ వాడన ఎన్నో సమస్యలు ఉన్నాయని ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. శంకుస్థాపనలకు, కొబ్బరికాయలకు మాత్రమే పరిమితం అయిన మేయర్‌, ఎమ్మెల్యేలు ఇందుకోసమే పన్నులు పెంచారా అంటూ ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయడంలో విఫలమైన మీరు పన్నులు ఎట్లా పెంచుతారని దుయ్యబట్టారు. ఎంత శాతం పన్ను పెంచారో చెప్పకుండా తీర్మానం చేయడం నియంత పోకడను చూపెడుతుందని, ప్రతి సంవత్సరం వచ్చే కోట్ల రూపాయలు నిధులను ఎక్కడ ఖర్చు చేసారో ప్రజలకు సమాధానం చేప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఇప్పటివరకు ఎన్ని కోట్లతో ఎన్ని అభివృద్ధి పనులు చేసారో శ్వేతపత్రం విడుదల చేయాలని, ఏం ఉద్ధరించారాని ఆస్తి పన్ను పెంచారో ప్రజలకు చెప్పాలన్నారు.

అనంతరం జిల్లా, గ్రేటర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌కాజిపేట మున్సిపల్‌ ‌సర్కిల్‌ ‌డిప్యూటీ కమీషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కట్ల శ్రీనివాస్‌రావు, ఈవి.శ్రీనివాస్‌రావు, బత్తిని శ్రీనివాస్‌రావు, సుంచు చంద్రయ్య, జక్కుల రమారవీందర్‌యాదవ్‌, ‌లింగం మౌనిక చరణ్‌రెడ్డి, తోట్ల రాజు యాదవ్‌, ‌రాహత్‌ ‌పర్వీన్‌, ‌మహమ్మద్‌ అయూబ్‌, ‌బంక సరళ, మహమ్మద్‌ అయూబ్‌,  ‌తోట వెంకన్న, బంక సంపత్‌యాదవ్‌, ‌నాయిని లక్ష్మరెడ్డి, మేకల ఉపేందర్‌, ‌పసునూరి మనోహర్‌, ‌బోయిని కుమార్‌యాదవ్‌, ఎ‌ర్ర మహేందర్‌, ‌మండల సమ్మయ్య, బండారి జనార్దన్‌గౌడ్‌, ‌బొంత సారంగం, చిన్న, గుర్రపు కోటేశ్వర్‌, ‌మిద్దెల శోభ, శివ, అలువాల కార్తీక్‌, ‌పల్లె రాహుల్‌ ‌రెడ్డి, తోట పవన్‌, ‌దూలం సదానందం గౌడ్‌, ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌నల్ల సత్యనారాయణ, కుర్ల మోహన్‌, ‌పస్కుల శ్రీనివాస్‌, ‌మహమూద్‌, ‌స్వామి, సందెల విజయ్‌, ‌కట్కూరి రేవంత్‌, ‌యాసీన్‌, ‌చిన్న, మహేందర్‌ ‌రెడ్డి, తాడూరి ప్రశాంత్‌, ‌లక్కీ బాయ్‌, ‌కిషన్‌ ‌పాల్గొన్నారు.

Tags: hanmakonda, Congress opposes increase in property tax, warangal, nayeni rajendar reddy

Leave a Reply