Take a fresh look at your lifestyle.

ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్‌ ‌నిజనిర్ధాణ కమిటీ

Congress on Delhi riots The fact and find Committee

ఢిల్లీ ఘర్షణలకు సంబంధించి కేంద్రంపై కాంగ్రెస్‌ ‌పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ‌నిజ నిర్దారణ కమిటీ వేసింది. ఇప్పటికే కాంగ్రెస్‌ ‌తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ను కలిసి మెమొరాండం సమర్పించారు. ఢిల్లీ హింసకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర •ంమంత్రి అమిత్‌ ‌షా రాజీనామా చేయాలని ఆదేశించాలని ఈ సందర్భంగా వారు రాష్ట్రపతిని కోరారు. అలాగే ఢిల్లీలో అల్లర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని కాంగ్రెస్‌ ‌పార్టీ ఆరోపిస్తుంది. తాజాగా ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులతో నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సోనియా గాంధీ తెలిపారు.

ఈ బృందం ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ కమిటీలో ముకుల్‌ ‌వాస్నిక్‌, ‌తారిక్‌ అన్వర్‌, ‌సుష్మితా దేవ్‌, ‌శక్తిసిన్హా గోహిల్‌, ‌కుమారి సెల్జా సభ్యులుగా ఉన్నారు. ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఈ కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సోనియాగాంధీకి అందజేయనున్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టాని కి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో 42 మంది మృతిచెందగా, 300 మందికిపైగా గాయపడ్డారు.

Leave a Reply