Take a fresh look at your lifestyle.

ఉద్యోగాలపై తప్పుడు లెక్కలు

  • మంత్రి కెటిఆర్‌ ‌ప్రకటనపై కాంగ్రెస్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత దాసోజు
  • గన్‌పార్క్ ‌వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్‌

రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిమచామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‌తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్‌ ‌విమర్శించారు. మంత్రి కేటీఆర్‌కు నిజాయితీ ఉంటే ఉద్యోగ ఖాళీలపై గన్‌పార్క్‌వద్ద బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్‌ ‌విసిరారు. ఇంత పచ్చిగా అబద్ధాలు ప్రచారం చేయడం దారుణమని అన్నారు.

ఈ సందర్భంగా శ్రావణ్‌ ‌కుమార్‌ ఒక ప్రకటన చేస్తూ ప్రగతి భవన్‌లో కూర్చుని, బుగ్గ కారులో తిరుగుతూ అధికార మదంతో విర్రవీగుతున్న కేటీఆర్‌కు అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందో సోయుందా? అంటూ ప్రశ్నించారు. దాదాపు 1500 మంది బిడ్డలు బలిదానం చేసుకున్న చరిత్ర గుర్తుందా? అన్నారు. వి•ఇంట్లో ఉద్యోగాలు పంచుకోవడానికి తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానం చేసుకోలేదన్నారు. నాలుగుకోట్ల మంది ప్రజల పిల్లలకు, యువతకు, విద్యార్షులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. వాళ్లజీవితాలు బావుండాలని తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలనే లక్ష్యంతో ఉద్యమాలు జరిగాయన్నారు.

యూనివర్శిటీల్లో విద్యార్ధులు జై తెలంగాణ అని పోరాటం చేసింది తెలంగాణ వొస్తే ఉద్యోగాలు వొస్తాయని, నిళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం కేటీఆర్‌ ‌మర్చిపోయారా? అంటూ ఆయన ప్రశ్నించారు. కేటీఆర్‌ ఐటీఐఆర్‌ ‌గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఐటీఐఆర్‌ ‌రాహుల్‌ ‌గాంధీ కల అని చెప్పారు. పొన్నాల లక్ష్మయ్య ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 50 ఎకరాల భూములను గుర్తించారని తెలిపారు. కేవలం 13వేల కోట్ల రూపాయలు 15 ఏళ్లలో ఖర్చుపెట్టాలి.

అని దాని ద్వారా రెండున్నర లక్షల కోట్ల ఇన్‌వెస్ట్‌మెంట్‌లు వొస్తాయని, 50వేల ఉద్యోగాలు వొస్తాయని గుర్తించారు. కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్‌ 13‌వేల కోట్ల నిధులను ఇవ్వలేదని కుంభకర్ణుడు నిద్ర నుంచి లేచినట్టు కేటీఆర్‌ ఇప్పు‌డు చేతకాని మాటలు చెబుతున్నారు. కేంద్రం ఇవ్వకపోతే వి• ఎంపీలు ఏం చేస్తున్నారు? ఏనాడైనా తెలంగాణకు ఇది కావాలని పోరాటం చేశారా వి• నాయకులు? ఏ మొహం పెట్టుకుని వోట్లు అడుగుతున్నారని శ్రావణ్‌ ‌కుమార్‌ ‌తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Leave a Reply