Take a fresh look at your lifestyle.

’మేమిద్దరం, మాకిద్దరు’

  • ఆ ‌నలుగురి చేతుల్లోనే దేశం నడుస్తోంది
  • ఆ ఇద్దరు ఎవరన్నది దేశానికి తెలుసు
  • మండీలను మట్టుపెట్టడానికే సాగుచట్టాలు
  • లోక్‌సభలో దుమ్మెత్తి పోసిన రాహుల్‌ ‌గాంధీ

‌లోక్‌సభ వేదికగా కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ కేంద్రంపై దుమ్మెత్తి పోశారు. గతంలో కుటుంబ నియంత్రణ సందర్భంగా ’మేమిద్దరం, మాకిద్దరు’ అన్న నినాదం బాగా ప్రచారంలో ఉండేదని, కరోనా తర్వాత మాత్రం పరిస్థితులు మారిపోయాయని పేర్కొన్నారు. కరోనా తర్వాత దేశం నలుగురు చేతుల మీదుగానే నడుస్తోందని, ’మేమిద్దరం, మాకిద్దరు’ అన్న చందంగా మారిపోయిందని కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ… వారిద్దరు ఎవరనేది ప్రపంచం మొత్తానికీ తెలుసని, ఈ ప్రభుత్వం ఎవరిదో అందరికీ అర్థమైపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షాలు రైతు నిరసన గురించే మాట్లాడుతున్నాయి కానీ, చట్టంలో ఏముందో మాట్లాడటం లేదన్న ప్రధాని వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. ఈరోజు చట్టాల్లో ఏముందో మాట్లాడి… ప్రధానిని సంతృప్తి పరుస్తా అంటూ రాహుల్‌ ‌వ్యాఖ్యానించారు.

దేశంలో ఎక్కడైనా ధాన్యాన్ని, పండ్లను, కూరగాయలను కొనుగోలు చేసుకోవచ్చని చట్టంలో ఉందని, ఇక ఎక్కడైనా కొనుగోలు చేసుకుంటే మండీకి వచ్చేవారు ఎవరుంటారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. మండీలను మట్టుబెట్టడానికే చట్టాలు తెచ్చారని ఆయన మండిపడ్డారు. పెద్దపెద్ద వ్యాపార వేత్తలు ఆహార ధాన్యాలను,పండ్లను, కూరగాయలను తమకు కావలసినంత నిల్వచేసుకోవచ్చన్నది చట్టంలో ఉందని, దీని ద్వారా నిత్యావసర వస్తువుల చట్టానికి తూట్లుపొడవటమేనని ఆయన విమర్శించారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యమం రైతుల ఉద్యమం ఎంత మాత్రమూ కాదని, ఇది దేశానికి చెందిన ఉద్యమం అని వివరించారు. రైతులు కేవలం ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం లేదని, ఉద్యోగావకాశాలు రావడం లేదని.. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కేంద్రం కేవలం ఇద్దరు వ్యాపార వేత్తలకు పెద్ద పీట వేయడం ద్వారానే జరుగుతు న్నాయని రాహుల్‌ ‌మండిపడ్డారు.

అన్న చందంగా మారిపోయిందని కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ… వారిద్దరు ఎవరనేది ప్రపంచం మొత్తానికీ తెలుసని, ఈ ప్రభుత్వం ఎవరిదో అందరికీ అర్థమైపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షాలు రైతు నిరసన గురించే మాట్లాడుతున్నాయి కానీ, చట్టంలో ఏముందో మాట్లాడటం లేదన్న ప్రధాని వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. ఈరోజు చట్టాల్లో ఏముందో మాట్లాడి… ప్రధానిని సంతృప్తి పరుస్తా అంటూ రాహుల్‌ ‌వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడైనా ధాన్యాన్ని, పండ్లను, కూరగాయలను కొనుగోలు చేసుకోవచ్చని చట్టంలో ఉందని, ఇక ఎక్కడైనా కొనుగోలు చేసుకుంటే మండీకి వచ్చేవారు ఎవరుంటారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. మండీలను మట్టుబెట్టడానికే చట్టాలు తెచ్చారని ఆయన మండిపడ్డారు.

పెద్దపెద్ద వ్యాపార వేత్తలు ఆహార ధాన్యాలను,పండ్లను, కూరగాయలను తమకు కావలసినంత నిల్వచేసుకోవచ్చన్నది చట్టంలో ఉందని, దీని ద్వారా నిత్యావసర వస్తువుల చట్టానికి తూట్లుపొడవటమేనని ఆయన విమర్శించారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యమం రైతుల ఉద్యమం ఎంత మాత్రమూ కాదని, ఇది దేశానికి చెందిన ఉద్యమం అని వివరించారు. రైతులు కేవలం ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం లేదని, ఉద్యోగావకాశాలు రావడం లేదని.. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కేంద్రం కేవలం ఇద్దరు వ్యాపార వేత్తలకు పెద్ద పీట వేయడం ద్వారానే జరుగుతు న్నాయని రాహుల్‌ ‌మండిపడ్డారు.

Leave a Reply