Take a fresh look at your lifestyle.

సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారు.

సభనుంచి వాకౌట్‌ ‌చేసిన కాంగ్రెస్‌
సభలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారంటూ సభ నుంచి కాంగ్రెస్‌ ‌వాకౌట్‌ ‌చేసింది. సీఎం కేసీఆర్‌, ‌మంత్రులు కావాలనే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వాపోయారు. చేయని తప్పుకు పదే పదే క్షమాపణలు చెప్పాలనటం సరైంది కాదన్నారు. సీఎం, మంత్రులు అహంకారంతో వ్యవహరిస్తున్నారన్నారు. సభ నడుస్తున్న తీరు ప్రజా స్వామ్యానికి పెను ప్రమాదంగా మారిందన్నారు.

ప్రతిపక్షం ఉండకూడదన్న ఉద్దేశంతోనే 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కలుపుకున్నా రన్నారు. రైతులు, నిరుద్యోగులు, నిత్యావసరాల పెరుగుదలపై మాట్లాడితే సీఎం తట్టుకోలేకున్నారని సీఎల్పీ నేత భట్టి పేర్కొన్నారు. అంతకు ముందు సభలో గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ  కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌చేస్తున్న పోరాటానికి మొదట టీఆర్‌ఎస్‌ ‌కూడా కలసి వచ్చిందని.. టీఆర్‌ఎస్‌ ‌రహదారుల దిగ్బంధం కూడా చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ ‌మళ్ళీ ఎందుకు యూ టర్న్ ‌తీసుకుందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. పెట్రోల్‌, ‌డిజిల్‌ ‌ధరలు బాగా పెరిగాయని, టాక్స్‌లు రెట్టింపు ఉన్నాయన్నారు. టాక్స్‌ల భారాన్ని ప్రభుత్వాలు తగ్గించాలని తెలిపారు. నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయన్నారు. గ్యాస్‌ ‌ధర విపరీతంగా పెరిగిందని..నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ‌ప్రాబ్లమ్‌ ఉం‌దని వ్యాఖ్యానించారు. వామన్‌ ‌రావు ,నాగమణి హత్యలే దీనికి నిదర్శనమన్నారు. ఈ హత్యలపై  కఠిన చర్యలు ఉంటాయని సీఎం నుంచి ప్రకటన వచ్చి ఉండాల్సిందని భట్టి విక్రమార్క తెలిపారు. అయితే భట్టి ప్రసంగాన్ని అడ్డుకోవడంతో పాటు ఆయన స్పీకర్‌ను శాసించాలన ఇచూశారని హరీస్‌ ‌రావు మండిపడ్డారు. దానికి క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ ‌వాకౌట్‌ ‌చేసింది.

Leave a Reply