Take a fresh look at your lifestyle.

‌కాంగ్రెస్‌ ‌నేతలు డుమ్మా

ప్రగతి భవన్‌లో మంగళవారం జరుగుతున్న పట్టణ ప్రగతి ప్రణాళిక సన్నాహక సదస్సును తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ఈ సమావేశానికి హాజరుకావాలని కాంగ్రెస్‌ ‌నేతలు మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, సీతక్క, పొడెం వీరయ్య తదితరులను ప్రభుత్వం ఆహ్వానించింది. సదస్సుకు హాజరుకావాలని ఎమ్మెల్యేలకు కలెక్టర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. అయితే ఈ సమావేశానికి వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని భావించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పట్టణ ప్రగతి సదస్సును బహిష్కరించారు.

కాగా ప్రగతిభవన్‌లో జరుగుతున్న సమావేశానికి తొలిసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందింది.ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యాచరణతో పాటు విధివిధానాలు ఖరారు చేయనున్నారు సీఎం కేసీఆర్‌. ఈ ‌సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం కేసీఆర్‌ ‌మార్గనిర్దేశర చేయనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply