Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ‌లేనిదే తెలంగాణ లేదనడం.. అవాస్తవం

సిద్దిపేట లేనిదే కేసీఆర్‌ ‌లేడు అనేది వాస్తవం
కెసిఆర్‌ ‌మాటలు స్వార్థ రాజకీయాలకు నిదర్శనం
మీ 2 లోకసభ సీట్ల వల్ల తెలంగాణ సాధ్యమయ్యేదా…?
సిఎం కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై కాంగ్రెస్‌
‌నేతలు జగ్గా రెడ్డి, మధు యాష్కి ఫైర్‌

‌కేసీఆర్‌ ‌లేనిదే తెలంగాణ లేదని సిద్దిపేటలో సీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ ‌నేతలు ఫైర్‌  అయ్యారు. సిద్ధిపేట
లేనిదే కేసీఆర్‌ ‌లేడు అనేది వాస్తవమని ..కానీ కేసీఆర్‌ ‌లేనిదే తెలంగాణ లేదు అనేది అవాస్తవమని కాంగ్రెస్‌ ‌ఫైర్‌ ‌బ్రాండ్‌ ‌సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం గాంధీభవన్‌లో చిట్‌ ‌చాట్‌ ‌చేస్తూ వ్యాఖ్యానించారు. మెదక్‌ ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో  ఉన్న  8 నియోజకవర్గాలలో టిఆర్‌ఎస్‌  ‌శాసనసభ్యులే ఉన్నారని సంగారెడ్డి, దుబ్బాకలో మాత్రమే  కాంగ్రెస్‌, ‌బీజేపీ  సభ్యులు ఉన్నామని సిద్దిపేట, గజ్వేల్‌ ‌మినహాయిస్తే మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా టిఆర్‌ఎస్‌ ‌శాసన సభ్యులే ఉన్నా ఆ నియోజకవర్గాలకు ఎందుకు నిధులు ఇవ్వట్లేదని నిలదీశారు. గత 6 సంవత్సరాలలో సంగారెడ్డికి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. సోనియా, రాహుల్‌ ‌తెలంగాణ ఇవ్వకపోతే ఈ రోజు కేసీఆర్‌ ఇం‌త అహంకారంగా మాట్లాడేవాడా అని, రైతులకు, యువతకు, మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం ఉపయోగపడుతుందని ఈ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిందన్నారు .తెలంగాణ ఇచ్చిన రోజు మాట వరుసకు కూడా ..సోనియా ,రాహుల్‌కు కేసీఆర్‌  ‌కృతజ్ఞత తెలపకపోవడం దారుణమన్నారు.
సిద్దిపేట నియోజకవర్గానికి హరీష్‌ ఆనిముత్యం కావొచ్చు కానీ.. ఉమ్మడి మెధక్‌ ‌జిల్లా  మిగతా నియోజకవర్గాలకు కాదన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్‌ ‌మీడియాతో మాట్లాడుతూ …గురువారం సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌లేకపోతే తెలంగాణ లేదు అనడం  స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. మీ 2 లోకసభ సీట్ల వల్ల తెలంగాణ సాధ్యమయ్యేదా…? అని ప్రశ్నించారు.స్వార్థ రాజకీయ భవిష్యత్‌ ‌కోసం కేసీఆర్‌ ‌తెలంగాణ ఉద్యమం చేశారని, తెలంగాణ బిడ్డల త్యాగాన్ని చూసి ఆంధ్రలో పార్టీ ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లి సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానం సోనియాగాంధీ తెలంగాణను ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాద్‌తో కూడిన ధనిక తెలంగాణను ఇస్తే అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో మోదీ, బీజేపీ పైన ఎన్నో విమర్శలు చేసి ఇవాళ ఢిల్లీ వెళ్లి మోదీ ముందు మొకరిల్లడం ఎందుకని ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటన వెనుక రహస్యం ఏంటన్నా•

Leave a Reply