Take a fresh look at your lifestyle.

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ‌మౌనదీక్ష

  • మోదీ విదేశీ విధానం పూర్తిగా విఫలం
  • చైనా సరిహద్దుల్లో సైనికలు హతమే కారణం
  • విమర్శలు గుప్పించిన పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌

‌మోదీ విదేశీ విధానం పూర్తిగా విఫలమైందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మిత్ర దేశాలన్నీ శత్రుదేశాలుగా మారుతున్నాయని చెప్పారు. రష్యాలాంటి మిత్రదేశం కూడా మొహం చాటేస్తోందని వ్యాఖ్యానించారు. నేపాల్‌ ‌సైతం భారత భూభాగాన్ని తనదిగా చెప్పుకుంటోందని పేర్కొన్నారు. భారత భూభాగంలోకి చైనా రాలేదని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. చైనాకు భారత్‌ ‌ధీటైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. పెట్రో ధరల పెంపు నిరసిస్తూ ఈనెల 29న ఆందోళనలు చేపడతున్నట్లు ఉత్తమ్‌ ‌ప్రకటించారు. ఇదిలావుంటే భారత-చైనా సరిహద్దులో చైనా ఘాతుకానికి బలైన 20 మంది వీర జవాన్లను స్మరిస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా ఉదయం 11 నుండి 12 గంటల వరకు గంటపాటు మౌన దీక్ష నిర్వహించారు.

అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కేడర్‌ ఈ ‌కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. గాంధీభవన్‌లో కూడా నేతలు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. అమరవీరులకు కాంగ్రెస్‌ ‌సలాం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిందని అన్నారు. భారత ప్రభుత్వం చైనా గో బ్యాక్‌ ‌నినాదాన్ని చేపట్టి భారత భూభాగం అంతా తీసుకెళ్లాలని సూచించారు. సూర్యాపేట సంతోష్‌ ‌బాబు మరణం బాధ కలిగించిందన్నారు. తాను కూడా ఇండో చైనా బార్డర్‌ ‌లో పని చేసానని, 47 ఏడేండ్లుగా ఒక్క సైనికుడు చనిపోలేదు…కానీ ఇప్పుడు సైనికులు చనిపోవడం బాధ కలుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇదంతా జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫారిన్‌ ‌పాలసీ ఫెల్‌ అయింది.పాకిస్తాన్‌తో, చైనా తో యుద్దవాతవారణమే నెలకొంది.. ప్రపంచ దేశాలు తిరిగిన ప్రధాని నరేంద్ర మోడీ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. చైనా సైనికులు భారత్‌ ‌బార్డర్‌లోకే రాలేదని ప్రధాన మంత్రి మోడీ చెప్పారు. మరి మన సైనికులు ఎలా చనిపోయారని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. దీక్షలో పొన్నం ప్రభాకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply