Take a fresh look at your lifestyle.

తప్పును ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?

భూముల అక్రమాలపై విచారణ జరిపించాలి: కోమటిరెడ్డి

ప్రజాతంత్ర ,హైదరాబాద్‌ : ‌కొకాపేట, ఇన్‌ ఆర్‌ ‌బిట్‌, ‌గోపన్‌ ‌పల్లి, మియపూర్‌ ‌భూ అక్రమాల పైన సిట్టింగ్‌ ‌జడ్జ్ ‌తో విచారణ జరిపించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్‌ ‌చేశారు.శుక్రవారం గాంధీభవన్‌ ‌లో కోమటిరెడ్డి మీడియా సమావేశం లో మాట్లాడుతూ రేవంత్‌ ‌రెడ్డి అరెస్ట్ ‌ను తీవ్రంగా ఖండిస్తునామని ఎంపీ ని అరెస్ట్ ‌చేసేటప్పుడు స్పీకర్‌ అనుమతి తీసుకోవాలని అన్నారు.గోపన్‌ ‌పల్లి భూముల గురించి తనకు తెలియదని రేవంత్‌ ‌రెడ్డి సోదరులు తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండని తెలిపారు..కానీ మియాపూర్‌ ‌భూముల సంగతి ఏంటని ప్రశ్నించారు ..?

111 జీవో కట్టడాల పైన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ని కలిసి చర్యలు తీసుకోమని చెప్పుతామని ,111 జీవో పైన పేదలకు ఒక్క న్యాయం సీఎం కొడుకు కేటీఆర్‌ ‌కు ఒక్క న్యాయమా? అంటూ మండిపడ్డరు. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాలు భూ ఆక్రమణ జరుగుతుందని ఫర్మా కంపినిల పేరు మీద భూ దందా చేస్తున్నారని కేటీఆర్‌ ‌తప్పు చేసారా లేదా అని వారు నిలదీశారు. 111 జీవో •ను తుంగలో తొక్కి కట్టిన భవనంలో కేటీఆర్‌ ఎం‌దుకు లీజ్‌ ‌కు తీసుకున్నారని కేటీఆర్‌, ‌కేటీఆర్‌ ‌సతీమణి పైన కేస్‌ ‌లు ఎందుకు పెట్టారని ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి ని ఎలా అరెస్ట్ ‌చేశారో స్పీకర్‌ ‌కు సభ హక్కుల నోటీస్‌ ‌లు ఇస్తామన్నారు.రేవంత్‌ ‌రెడ్డి అరెస్టు పాశవిక పాలనకు నిదర్శనమని తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ ఏఐసీసీ ఇన్‌ ‌ఛార్జ్ •ఆర్‌ ‌సి కుంతియా అన్నారు.శుక్రవారం •పార్టీ కార్యాయం నుండి కుంతియా పత్రిక ప్రకటన విడుదల చేశారు.రేవంత్‌ ‌రెడ్డి అరెస్ట్ ‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.కుంతియా తోపాటు రేవంత్‌ అరెస్ట్ ‌ను సిఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క ,ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు ,ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి , మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ ‌లు ఖండించారు .

శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ ‌లో భట్టి ,శ్రీధర్‌ ‌బాబు ,జీవన్‌ ‌రెడ్డి లు మాటాడుతూ ….తెలంగాణ ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తోందని లోక్‌ ‌సభ సభ్యుని దుర్మార్గంగా అరెస్ట్ ‌చేయడం కరెక్ట్ ‌కాదని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఆరోపణలతో లోకసభ సభ్యుని అరెస్ట్ ‌చేసి జైల్‌ ‌కి పంపడం మొదటి సారని •రేవంత్‌ ‌రెడ్డి అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నామని, బేషరతుగా వెంటనే రేవంత్‌ ‌పై కేసును కొట్టివేసి విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు ..కేటీఆర్‌ ‌ఫామ్‌ ‌పై మంత్రి స్పందించి స్పష్టత ఇవ్వాలని అన్నారు .111 జివో ఉల్లంఘన జరిగిందా లేదా అనేది కేటీఆర్‌ ‌సమాధానం చెప్పాలన్నారు .రేవంత్‌ ‌రెడ్డి డ్రోన్‌ ఉపయోగించినట్లు ప్రభుత్వం ఆధారాలు బయటపెట్టాలని ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు డిమాండ్‌ ‌చేశారు.ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం కరెక్ట్ ‌కాదని మండిపడ్డారు.కేటీఆర్‌ ‌తన విలాసవంతమైన జీవనం కోసం 111 జీవోను ఉల్లంఘించారని ,కేటీఆర్‌ ఉల్లంఘనలను బయటపెట్టినందుకు రేవంత్‌ ‌రెడ్డిని అరెస్ట్ ‌చేయడం కరెక్ట్ ‌కాదని ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి తప్పుపట్టారు.

రేవంత్‌ అరెస్ట్ ‌పై ఆందోళనలు ,నిరసనలు •ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి అరెస్ట్ ‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఆందోళనలు చేశారు.కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను పోలీస్‌ ‌లు అడ్డుకొని పోలీస్‌ ‌స్టేషన్లకు తరలించారు. కొన్ని ప్రాంతాలలో ముందస్తు అరెస్టులు చేశారు.కాంగ్రెస్‌ ‌నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేసి పోలీస్‌ ‌స్టేషన్లకు తరలించారు . ••చట్టప్రకారమే నడుచుకుంటాం: హైకోర్టుకు సర్కార్‌ ‌వివరణ••కాంగ్రెస్‌ ఎం‌పీ రేవంత్‌రెడ్డి సోదరుల పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ముగించింది. గోపన్‌పల్లి భూములకు సంబంధించి రేవంత్‌ ‌సోదరులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం కోర్టుకు నిశితంగా వివరించింది. ఒకవేళ చర్యలు తీసుకుంటే రేవంత్‌ ‌సోదరులకు నోటీసులు ఇచ్చిన తర్వాతే ముందుకెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ చర్యలు తీసుకోవాలన్నా చట్టం ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు తేల్చిచెప్పింది. చట్టం ప్రకారమే ముందుకెళ్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీంతో రేవంత్‌రెడ్డి సోదరుల పిటిషన్‌ను హైకోర్టు ముగించింది.

Tags: Sitting Judge on Kokapeta, InRbit, Gopan Palli, Miyapur

Leave a Reply