Take a fresh look at your lifestyle.

గ్యాస్‌ ‌బదలు కట్టెల పొయ్యలు వాడాలేమో..!

మోడీ తీరుపై మండిపడ్డ రాహుల్‌ ‌సహా కాంగ్రెస్‌ ‌నేతలు
కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పేరున చెబుతున్న మాటలకు వాస్తవాలకు పొంతన లేకుండా పోతుందని కాంగ్రెస్‌ ‌నేతలు దుయ్యబట్టారు. మోడీ చెబుతున్న మాటలు ప్రజలను వంచించేలా ఉన్నాయని అభివృద్దికి దూరంగా లక్షలాది కుటుంబాలు గ్యాస్‌కు బదులుగా క్టటెల పొయ్యిని వాడాల్సి వొస్తుందంటూ వారు విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ‌నేతలు రాహుల్‌ ‌గాంధీ, అధీర్‌ ‌రంజన్‌, ‌తదితరులు వేర్వేరుగా కేంద్ర ప్రభుత్వంపై తమ ట్వీట్స్ ‌ద్వారా ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి బండి రివర్స్ ‌గేర్‌లో ఉందని, దాని బ్రేకులు కూడా ఫెయిలయ్యాయని విమర్శించారు. ఒక సర్వే ప్రకారం భారత్‌లోని 42 శాతం మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు వంట చేయడానికి గ్యాస్‌ ‌సిలిండర్లను కొనుగోలు చేసే శక్తి లేక, తిరిగి క్టటెల పొయ్యినే వినియోగిస్తున్నారంటూ ఓ పత్రికలో ప్రచురితమైన వార్త స్క్రీన్‌షాట్‌ను రాహుల్‌ ‌గాంధీ ఈ సందర్భంగా షేర్‌ ‌చేశారు.

ఇక..గత డాది పెట్రోల్‌, ‌డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ని రకాల పన్నులను ఉపసంహరించుకోవాలని, 2022 మార్చి వరకు ఉచిత రేషన్‌ ‌పథకాన్ని రద్దు చేయరాదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ‌ఖేరా డిమాండ్‌ ‌చేశారు. కోవిడ్‌ ‌పేరుతో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పన్నులు విధించి పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 పెంచిందని, జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయని, ఈ తరుణంలో పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లోకి చైనా 4-5 కిలోమీటర్ల లోపలికి ప్రవేశించిందని పెంటగాన్‌ ‌నివేదిక చెబుతున్నా భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. మోడీ చేస్తున్న ప్రకటనలు కేవలం వ్యాపారవేత్తలకు మాత్రమే లబ్ది చేకూర్చేలా ఉన్నాయని అధీర్‌ ‌రంజన్‌ అన్నారు.

Leave a Reply