Take a fresh look at your lifestyle.

రేవంత్‌కు పిసిసి అప్పగిస్తే ఊరుకోం

  • టిడిపి నుంచి వొచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారు..?
  • రేవంత్‌ ‌తెలంగాణ వ్యతిరేకి
  • అధిష్టానంపై కాంగ్రెస్‌ ‌నేత విహెచ్‌ ఆ‌గ్రహం

అటు ఢిల్లీలోనూ.. ఇటు హైదరాబాద్‌లోనూ పిసిసి అధ్యక్ష పదవికోసం రేవంత్‌ ‌పేరే ప్రముఖంగా వినపడుతోంది. ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోన్న సమాచారం ప్రకారం.. రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా దాదాపు ఖరారు అయ్యారని, అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమని తెలుస్తోంది. దీంతో అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీపడిన కొంతమంది కాంగ్రెస్‌ ‌నాయకులు నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత వీహెచ్‌ ‌హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకత్వ బాధ్యతలు టీడీపీ నుంచి వొచ్చిన రేవంత్‌కు అప్పగించడం సరైనది కాదని నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బ్యాక్‌‌గ్రౌండ్‌ ‌నుంచి వొచ్చారని విమర్శించారు.

అతన్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తనతోపాటు చాలామంది కాంగ్రెస్‌ ‌పార్టీని వీడుతారని వ్యాఖ్యానించారు. పార్టీలోని సీనియర్లను విస్మరిస్తున్నారని, సీనియర్‌ ‌నేతలంతా అసంతృప్తిలో ఉన్నారన్నారు. శుక్రవారం విహెచ్‌ ‌హైదరాబాద్‌లో వి•డియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో తాను సీనియర్‌ అని వీ హనుమంతరావు అన్నారు. గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉన్నానని, ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఏం సంపాదించుకోలేదన్నారు. 2018 నుంచి ఇప్పటి వరకూ సోనియాగాంధీని కలవడానికి అపాయింట్‌ ‌మెంట్‌ ఇవ్వలేదని, కావాలనే కలవకుండా ఒక సెక్షన్‌ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ విషయంపై హైకమాండ్‌ ఆలోచన చేయాలన్నారు. తనకు ఎందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వరా అని వీహెచ్‌ ‌సూటిగా ప్రశ్నించారు.

Leave a Reply