న్యూ దిల్లీ, డిసెంబర్ 20 : కాంగ్రెస్ కీలక నేత రాహుల్‌గాంధీ ఈసారి అమేథీ నుంచి పోటీ చేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నాయకుడు అజయ్ రాయ్ కొట్టిపారేశారు. అమేథీ స్థానం ఎప్పుడైనా గాంధీ కుటుంబాలదేనని ఆయన చెప్పారు. ’స్మ•తి ఇరానీ లాంటి వాళ్లు వస్తారు. వెళ్లిపోతారు’ అని వ్యాఖ్యానించారు. అజయ్ రాయ్ వ్యాఖ్యలను స్మ•తి ఇరానీ తప్పుపట్టారు. లోక్‌సభలో ఆ వ్యాఖ్యలను ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తంచేశారు.
తనను కించపరిచేలా మాట్లాడినందుకు అజయ్ రాయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్మ•తి ఇరానీ డిమాండ్‌పై అజయ్ రాయ్ స్పందించారు. ఆమెకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.లట్కే / జట్కే అనేది తమ వ్యవహారిక భాషా పదమని, ’ఏదో ఒకటి చెప్తారు, చేస్తారు’ అనేది ఆ పదానికి అర్థమని, అది అసభ్య పదజాలం, అనరాని వ్యాఖ్య ఎలా అవుతుందని అజయ్ రాయ్ ప్రశ్నించారు. తాను తప్పుడు మాటే మాట్లాడనప్పుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.