Take a fresh look at your lifestyle.

విపక్షాలు ఏకం కావాలి..బలమైన శక్తిగా నిలవాలి

  • బ్రేక్‌ఫాస్ట్ ‌మీటింగ్‌లో రాహుల్‌ ‌పిలుపు
  • విపక్షాలను ఏకం చేస్తున్న పెగాసస్‌
  • ‌మోడీ లక్ష్యంగా వ్యూహం…రాహుల్‌ ‌చురుకైన పాత్ర
  • పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెంపుకు నిరసనగా సైకిల్‌పై పార్లమెంటుకు కాంగ్రెస్‌ ‌నేత

విపక్షాలన్నీ ఏక తాటిపైకి వొచ్చి బలమైన శక్తిగా నిలబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ అన్నారు. విపక్ష పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఫోర్ల్ ‌లీడర్లతో కాన్‌స్టిట్యూషన్‌ ‌క్లబ్‌లో రాహుల్‌ ‌మంగళవారం ఉదయం బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌మీట్‌ ఏర్పాటు చేశారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో విపక్షాలు ఐక్యశక్తిగా నిలవాలని రాహుల్‌ ఈ ‌సందర్భంగా వారిని కోరారు. విపక్షాలన్నీ ఏకమైనప్పుడే ప్రజావాణిని సమర్థవంతంగా వినిపించగలుగుతామని అన్నారు. అలా కాని పక్షంలో బీజేపీ-ఆర్‌ఎఎస్‌ఎస్‌ను ఎదుర్కువడం, ప్రజావాణిని అణిచివేయకుండా వారిని నిలువరించడం కష్టమవుతుందని అన్నారు. పెగాసస్‌ ‌నిఘా అంశంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..ప్రతిపక్షాలను ఏకం చేస్తుంది. దీనిపై రాహుల్‌ ‌మరోమాచు చురుకుగా వ్యవహరిస్తూ విపక్షాలను ఏకతాటిపైకి తీసుకుని వొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశంపై మొత్తం పార్లమెంట్‌ ‌సమావేశాలనే బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌గాంధీతోపాటు అనేకమంది ప్రతిపక్ష నేతలు, రచయితలు, మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులపై పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌ద్వారా నిఘా ఉచ్చు బిగించారని వార్తా కథనాలు రావడం, దీనిపై విపక్షాలు జూలై 19 నుంచి పార్లమెంట్‌ ఉభయ సభలను స్తంభింపజేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాహుల్‌ ‌వరుసగా రెండోరోజూ విపక్షాలతో భేటీ అయ్యారు. ఉమ్మడిగా మోడీని ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు సమాచారం. పెగాస్‌సపై చర్చించాలని తాము రోజూ ప్రవేశపెడుతున్న వాయిదా తీర్మానాలను ప్రభుత్వం తిరస్కరించడంతో ప్రతిపక్షాలు కలిసికట్టుగా కార్యాచరణకు పూనుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాహుల్‌గాంధీ ఆహ్వానం మేరకు మంగళవారం ఢిల్లీలో 14 పార్టీల నేతలు అల్పాహార విందు సమావేశానికి హాజరై పెగాసస్‌పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉమ్మడిగా అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. తరవాత రాహుల్‌ ‌విపక్షాలతో కలసి సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్లారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష పారీలు కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్‌పీ, కేరళ కాంగ్రెస్‌, ‌జార్ఖండ్‌ ‌ముక్తి మోర్చా, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌, ‌లోకతాంత్రిక్‌ ‌జనతాదళ్‌ ‌పార్టీలకు చెందిన ప్లోర్‌ ‌లీడర్లు హాజరయ్యారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాలానికి వ్యతిరేకంగా అంతా కలిసి పోరాడాలని రాహుల్‌ ఈ ‌సందర్భంగా అన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమై మన స్వరం వినిపిస్తే, మన స్వరం అంత బలంగా మారుతుందని కాంగ్రెస్‌ ‌నేత తెలిపారు. విపక్ష పార్టీ నేతలతో బ్రేక్‌ఫాస్ట్ ‌ముగిసిన తర్వాత.. రాహుల్‌ ‌గాంధీ పార్లమెంట్‌కు సైకిల్‌ ‌యాత్ర చేపట్టారు. ఆ ర్యాలీలో విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. పెగాసస్‌ ‌వ్యవహారం, పెట్రో ధరలు, సాగు చట్టాల రద్దు అంశంలో కేంద్ర వైఖరిని ప్రతిపక్ష పార్టీలు తప్పుపట్టాయి. మాక్‌ ‌పార్లమెంట్‌ ‌నిర్వాహించాలని విపక్షాలు భావిస్తున్న విషయం తెలిసిందే. కావాలనే తమ పార్టీ నేతలను కేసుల్లో ఇరికిస్తున్నారని, దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని రాహుల్‌ ఆరోపించారు.

Congress leader in Parliament on bicycle to protest hike in petrol, diesel prices

రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికై నరేంద్ర మోదీ, అమిత్‌ ‌షా ద్వయం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే అభిప్రాయం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏర్పడింది. అవినీతి, నల్లధనం విషయంలో రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్‌ అవుతున్నారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌విషయంలో కూడా ఒకరిద్దరు స్థానిక బీజేపీ నాయకులు ఇలాంటి ప్రకటనలే చేయడంతో ఆయనకు గట్టిగానే జవాబిచ్చారు. సమాఖ్య స్ఫూర్తి మేరకు రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా కూడా చెల్లించడం లేదని ఎదురుదాడి చేశారు.

పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెంపుకు నిరసనగా సైకిల్‌పై పార్లమెంటుకు కాంగ్రెస్‌ ‌నేత
రోజురోజుకూ చుక్కలనంటుతున్న పెట్రోల్‌, ‌డీజిల్‌, ఇతర నిత్యవసరాల ధరలపై కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ వినూత్న శైలిలో నిరసన తెలిపారు. మంగళవారంనాడు సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్లారు. ఆయన వెంట విపక్ష పార్టీల నేతలు కూడా సైకిళ్లపై అనుసరించారు. దీనికి ముందు, రాహుల్‌ ‌పార్లమెంటు విపక్ష పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ప్లోర్‌ ‌లీడర్లతో కాన్‌స్టిట్యూషన్‌ ‌క్లబ్‌లో బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌వి•ట్‌ ఏర్పాటు చేశారు.

Leave a Reply