Take a fresh look at your lifestyle.

ఉద్యోగాల భర్తీపై అబద్ధాల లెక్కలతో బురిడీ

కెటిఆర్‌ ‌ప్రకటనపై కాంగ్రెస్‌ ‌నేత జీవన్‌ ‌రెడ్డి మండిపాటు
అబద్ధాలు చెప్పడంలో మంత్రి కేటీఆర్‌..‌కేసీఆర్‌ను మించిపోయాడని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో అబద్ధాలతో లెక్కలు చెప్పి ప్రజలను బురిడీ కొట్టించాలనుకుంటే నమ్మరని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 2014లో అసెంబ్లీ సమావేశాల్లో లక్ష 7 వేల ఉద్యోగాల ఖాళీలున్నాయని సీఎం కేసీఆర్‌ ‌చెప్పాడని..మరి కేటీఆర్‌ ‌లక్ష 31 వేల ఉద్యోగాలు ఎలా భర్తీ చేశాడని ఆయన ప్రశ్నించారు.

విద్యుత్‌ ‌శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలర్‌ ‌చేస్తే కొత్తగా భర్తీ చేసినట్లా.. అని అడిగారు. సింగరేణి కాలరీస్‌ ‌కంపెనీలో 12500 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కేటీఆర్‌ ‌చెప్పాడని.. కానీ హెల్త్ ‌సహకరించక వారి పిల్లలను ఉద్యోగాలలో తీసుకుంటే.. ఆ ఉద్యోగాలను కూడా భర్తీ చేసినట్లేనా అని అన్నారు. హార్టికల్చర్‌ ‌విభాగంలో 80 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పిన కేటీఆర్‌..ఆ ‌విభాగంలో 440 మంది హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌లకు జీతాలు చెల్లించక తొలగించారన్నారు. ఉపాధి హావి• పధకంలో క్షేత్ర స్థాయి అధికారులను తొలగించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.

పాఠశాలల్లో ఊడ్చే స్కావెంజర్‌లను కూడా తొలగించడంతో టీచర్‌లే ఊడ్చుకుంటున్నారని అన్నారు. యూనివర్సిటీలలో వీసీల భర్తీ చెయ్యలేదని, టీఎస్పీఎస్సి బోర్డు మెంబర్ల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయన్నారు. తెలంగాణ వొస్తే..బతుకులు మారుతాయని యువకులు పోరాటం చేశారని, కానీ కేసీఆర్‌ ‌వారి పోరాటాన్ని ఆగం చేసిండని అన్నారు. నిరుద్యోగ భృతిపై ప్రకటన చేసి రెండున్నర ఏళ్ళు అవుతున్నా.. నిరుద్యోగులకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు.

Leave a Reply