- పోలిసుల తీరుపై గవర్నర్‌ని కలుస్తాం, న్యాయపోరాటం చేస్తాం
- కేసీఆర్ , డీజీపీ , సీపీ నాటకాలాడుతున్నారు :పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- గవర్నర్ ప్రశ్నించినా ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదు…
- నిమ్స్ హాస్పిటల్‌కి గవర్నర్ వెళ్లకుండా అడ్డుకున్నారు.. షబ్బీర్ అలీ
- సొంత ఉమ్మడి జిల్లాకే కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదు ..జగ్గారెడ్డి
కాంగ్రేస్ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్ట్ లను పక్కన పెట్టికమీషన్ ల కోసం కేసీఆర్ ప్రాజెక్ట్ లను డిజైన్ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.కేసీఆర్ రాష్ట్రాన్ని దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు.శనివారం కాంగ్రెస్ పార్టీ గోదావరి జలదీక్ష పేరుతో పెండింగ్ ప్రాజెక్ట్ లను సందర్శించలని భావించింది కానీ పోలిసులు కాంగ్రెస్ నేతలను ముందుస్తుగానే అరెస్ట్ చే•
• దీక్షను భగ్నం చేసింది.దింతో నేతలందరని అరెస్ట్ చేయడం పై పీసీసీ చీఫ్ మండిపడ్డారు.బంజారాహిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ,మాజీ మంత్రి షబ్బీర్ అలీ ,మాజీ ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ …కేసీఆర్ కు కొంత మంది పోలీసు అధికారులు తొత్తులుగా మారారని ,ప్రతిపక్షాన్ని తొక్కేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ లో ప్రజాస్వామ్యం ఈ విధంగా ఉంటుందని అనుకోలేదన్నారు .రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ లు కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యం గా మారారని విమర్శించారు.సీఎం కేసీఆర్ కు, కేటిఆర్ , మంత్రులకు టీఆరెస్ నేతలకు ఏలాంటి కోవిడ్ ఆంక్షలు ఉండవా అని ,కాంగ్రెస్ నేతలకే కోవిడ్ 19 ఆంక్షలు ఉంటాయా? అని ప్రశ్నించారు .అసలు కేసీఆర్ ఏమి అభివృద్ధి చేస్తున్నాడో ప్రజలకు వివరించాలని ప్రాజెక్ట్ లను సందర్శించాలని అనుకున్నామని కానీ ఇవ్వాళ కూడా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 2 న కృష్ణా పరివాహక ప్రాజెక్ట్ ల వద్దకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని ,మంజీరా డ్యాం ను పరిశీలించేందు కు వెళ్తుంటే అరెస్ట్ చేసి కేసులు పెట్టారని, కరెంటు బిల్లులు పై మంత్రులను , అధికారులను కలవాలనుకున్నాం కానీ హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారని అసలు ఇందులో తప్పేముందని డిజిపి ని ప్రశ్నించారు .కరోన వ్యాప్తి నివారణ కోసం యూనియన్ హోం మినిస్ట్రీ నోటిఫికేషన్ విడుదల చేశారని రాష్ట్ర పోలీస్ లు చెబుతున్నారు ఆ నోటిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ నేతలకే వర్తిస్తుందా అన్నారు .డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ చేసిన ,లేఖ రాసిన నోరు మెదపడం లేదని విమర్శించారు .కాంగ్రెస్ నేతలు విహెచ్ ,రాములు నాయక్ ,సంపత్ ,జీవన్ రెడ్డి ,భట్టి విక్రమార్క ,పొడెం వీరయ్య , సీతక్క ,శ్రీధర్ బాబు ,జిల్లా అధ్యక్షులు ,కార్యకర్తలని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు .ఇదేమి జాగీర్ టీఆరెస్ కాదని కాంగ్రెస్ పార్టీ ఏ పొరటనికైనా సిద్ధమని అన్నారు.కేసీఆర్, డీజీపీ, హైదరాబాద్ కమిషనర్ లు నాటకం ఆడుతున్నరని ,కాంగ్రెస్ నేతల పట్ల పోలీస్ లు వ్యవరిస్తున్న తీరుప గవర్నర్ ను కలుస్తామన్నారు. అలాగే పోలీస్ ల తీరు పై న్యాయ పోరాటం కూడా చేయబోతున్నామని తెలిపారు .