Take a fresh look at your lifestyle.

లక్షమందితో నేటి దండోరా సభకు కాంగ్రెస్‌ ‌సన్నాహం

  • చీఫ్‌ ‌గెస్టుగా మల్లిఖార్జున ఖర్గే
  • టాగూర్‌తో పాటు ఏఐసిసి, టిపిసిసి సీనియర్లు హాజరు
  • నేడు గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సబ•కు ఏర్పాట్లు పూర్తి•
  • జగ్గారెడ్డి హాజరుపై సర్వత్రా ఉత్కంఠ

మరికొన్ని గంటల్లోనే సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ జరగనున్నది. శుక్రవారం జరిగే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గజ్వేల్‌లోని వర్గల్‌ ‌రోడ్డులో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు కనీసం లక్షమంది పార్టీ శ్రేణులు తరలిరానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సిఎం కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో నిర్వహించే ఈ దండోరా సభకు అఖిల భారత కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన సీనియర్‌ ‌నాయకుడు, రాజ్యసభలో కాంగ్రెస్‌ ‌పార్టీ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా రానున్నారు.

భూతో నభవిష్యత్‌ అన్న చందంగా గజ్వేల్‌ ‌దండోరా సభను కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్వహించనున్న ఈ సభకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం టాగూర్‌తో పాటు ఏఐసిసి, టిపిసిసి సీనియర్లు హాజరు కానున్నారు. గత నెలలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో రెండ్రోజుల పాటు ఆత్మగౌరవ దీక్ష చేపట్టిన సందర్భంలోనే త్వరలోనే సిఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌గడ్డపైనా దళిత, గిరజన ఆత్మగౌరవ దండోరా సభను నిర్వహించి తీరుతామనీ టిపిసిసి చీఫ్‌ ‌హోదాలో రేవంత్‌ ‌ప్రతినబూనిన విషయం విధితమే. మూడుచింతలపల్లిలో ప్రకటించిన విధంగా ఈ నెల 17న  గజ్వేల్‌లో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారు. పిసిసి చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక తీసుకున్న తర్వాత దళిత-గిరిజన దండోరా ఆత్మగౌరవ సభను తొలుత ఇంద్రవ్లెతో నిర్వహించగా ఆ సభ కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో జోష్‌ను తేవడంతో వరుసగా దండోరా ఆత్మగౌరవ సభలు, దీక్షలను నిర్వహించాలని టిపిసిసి నిర్ణయం తీసుకుంది.

దీనిలో భాగంగా ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో మొట్ట మొదటగా గజ్వేల్‌లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడమే కాకుండా, ఈ సభ(దీక్ష)ను సక్సెస్‌ ‌చేసేందుకు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని పార్టీ నేతలందరూ కలిసి కట్టుగా సమన్వయంతో కలిసి పని చేయాలని రేవంత్‌రెడ్డిని కలిసిన పలువురు నేతలకు సూచించారనీ సమాచారం. డిసిసి ప్రెసిడెంటు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో జరిగే   గజ్వేల్‌ ‌సభకు ఇంఛార్జిగా కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, మాజీ మంత్రి గీతారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. గీతారెడ్డితో పాటు ఇదే జిల్లాకు చెందిన దామోదర రాజనర్సింహాతో పాటు పార్టీ సీనియర్లు మల్లు రవి, షబ్బీర్‌ అలీ, రాంరెడ్డి దామోదరరెడ్డి  తదితరులు పర్యటించి సభ ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ శ్రేణులను తరలించేందుకు ఎప్పటికప్పుడు స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఓ వైపు దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూనే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాలని కాంగ్రెస్‌ ‌నేతలు డిమాండు చేస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట మార్చిన కేసీఆర్‌ ‌సిఎం పదవిలో కూర్చోవడం దళితులను అవమానించినట్టే అంటున్నారు. అంతేకాకుండా,  దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదన్నారు.

మరోమారు దళితులను మోసం ఉంచేందుకే దళిత బంధు కార్యక్రమం ముందు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం కేసీఆర్‌ ‌దళితులను పట్టించుకున్న పాపాన పోలేదనీ,  కేవలం కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలోని దళితులకు న్యాయం జరిగిందన్నారు. దండోరా కార్యక్రమం విజయవంతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి సిఎం కేసీఆర్‌కు నిరసన సెగ తగిలేలా గజ్వేల్‌లో దండోరా కార్యక్రమం చేపడతామంటున్నారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో దళిత-గిరిజనం తరపున కాంగ్రెస్‌ ‌మోగిస్తోన్న శంఖారావం కావడంతో కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు ఈ దండోరాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలకు  కౌంటర్‌గా ఈ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ‌నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు గజ్వేల్‌ ‌సభతో ముగియనున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. గజ్వేల్‌ ‌సభ ఆఖరిది కావడంతో పెద్దయెత్తున రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు తరలించి ఈ సభను సక్సెస్‌ ‌చేసి కాంగ్రెస్‌ ‌సత్తా ఏమిటో సిఎం కేసీఆర్‌కు తెలిసి వచ్చేలా చేసేందుకు టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి తనదైనశైలిలో ముందుకు వెళ్తుండగా…పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి వంటి కొందరు నేతలు మినహా మిగతా రాష్ట్ర నాయకులందరూ రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నట్లు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది.

జగ్గారెడ్డి హాజరుపై  సర్వత్రా ఉత్కంఠా?
గజ్వేల్‌ ‌వేదికగా నేడు సనుగనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు జగ్గారెడ్డి హాజరుపై• సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డితో జగ్గారెడ్డి అంటీముట్టనట్లు ఉండటం…వరుసగా టిపిసిసి చీఫ్‌ ‌నిర్వహిస్తున్న మీటింగ్‌లకు, జూమ్‌ ‌మీటింగులకు గైర్హాజర్‌ ‌కావడం, ఒకవేళ హాజరైనా కూడా రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు సంధించడమే. ఇదిలా ఉంటే, గజ్వేల్‌లో ఆత్మగౌరవ సభను పెద్దయెత్తున  నిర్వహించేందుకు ఓ వైపు ఏర్పాట్లు జోరుగా సాగుతుండగా…మరోవైపు జగ్గారెడ్డి మాత్రం గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేసే విషయంలో కూడా అంత సుముఖంగా లేరనే ఊహాగానాలు వినిపించాయి కూడా. ఈ విషయంలో రేవంత్‌ ‌రెడ్డి ఆలోచన మాత్రం వేరే విధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను పెద్దయెత్తున నిర్వహించడం ద్వారా ఏకంగా సిఎం కేసీఆర్‌కు సవాల్‌ ‌విసిరినట్టుగా ఉంటుందనీ భావిస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీలో చర్చ సాగుతుంది.

అందుకు తగ్గట్టుగానే డిసిసి ప్రెసిడెంటు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యలో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. గజ్వేల్‌లో సభను నిర్వహించే ప్రదేశాన్ని పార్టీ నేతలు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, షబ్బీర్‌ అలీ, మల్లు రవి తదితర రాష్ట్ర  నేతలు సందర్శించారు. అయితే, టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు హోదాలో ఉన్న ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాకు చెందిన జగ్గారెడ్డి మాత్రం గజ్వేల్‌ను విజిట్‌ ‌చేసిన దాఖలాలు లేకపోవడంతో గజ్వేల్‌లో నిర్వహించే సభకైనా హాజరవుతారా? గైర్హాజర్‌ అవుతారా?అన్న ఉత్కంఠ పార్టీలో వ్యక్తమవుతున్నది.  టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి లక్ష్యంగా సుతిమెత్తంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో ఒకింత కలకలం రేపుతున్నాయి. అంతేకాదూ, జగ్గారెడ్డి రేవంత్‌రెడ్డిపై కినుక వహించడంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కలిసి పని చేస్తామని చెబుతూనే…పరోక్షంగా టిపిసిసి చీఫ్‌ను టార్గెట్‌ ‌చేస్తూ జగ్గారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు,  అసంతృప్తి నెలకొందని తెలుస్తున్నా వారిని సరైన దారిలో పెట్టేందుకు రేవంత్‌రెడ్డి నానా తంటాలు పడాల్సి వస్తుందని తెలుస్తుంది. అయితే, పార్టీ బలోపేతం కోసం అహార్నిశలు శ్రమించే జగ్గారెడ్డి…తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పార్టీలో హాట్‌ ‌హాట్‌గా చర్చ సాగుతుంది. మొత్తంగా రేవంత్‌రెడ్డి-జగ్గారెడ్డి మధ్యన రోజు రోజుకూ అగాథం పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో గజ్వేల్‌లో శుక్రవారం నిర్వహించే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు హజరవుతారా? గైర్హాజర్‌ అవుతారా? అని తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి!

కేసీఆర్‌ ‌పాలనపైన చార్జిషీట్‌…
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నుంచి తమ సత్తా ఏమిటో చాటాలని టిపిసిసి నాయకత్వం చూస్తుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను కూడా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34వేల పైచిలుకు బూతు కమిటీల నుంచి పార్టీ శ్రేణులు తరలి రావాలని ఇప్పటికే టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చిన విషయం విధితమే. రాష్ట్ర నలుమూలల నుంచి గజ్వేల్‌ ‌దండోరా సభకు పార్టీ శ్రేణులు తరలిరానున్నారు. కాగా,  గజ్వేల్‌ ‌వేదికగా  గత ఏడేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందనీ, ఈ నేపథ్యంలో సిఎం కేసీఆర్‌ ఏడేళ్ల వైఫల్యాలపై ‘చార్జిషీట్‌’ ‌విడుదల చేయాలని టిపిసిసి ముఖ్య నేతల సమావేశం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈనెల 17న గజ్వేల్‌లో నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో ఈ చార్జిషీట్‌ను ప్రజల ముందుంచాలని టిపిసిసి నేతలు తీర్మానించినట్లు సమాచారం.

Leave a Reply