వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కాంగ్రెస్‌ ‌గెలుపు అభివృధ్దికి బాటలు వేస్తోంది

January 18, 2020

congress party, puvvalla durgaprasad, sanjeeva reddy bhavan

ఖమ్మం, జనవరి 17 (ప్రజాతంత్ర విలేకరి) : ఈనెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్దులకు ఓటు వేసి అభివృధ్దికి బాటలు వేయాలని జిల్లా కాంగ్రెస్‌ ‌కమిటి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ ‌పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ మెనిఫెస్టోను విడుదల చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవినీతిరహితంగా ప్రతి మున్సిపాలిటిని తీర్చిదిద్దుతామని, అత్యుత్తమ ప్రజాసేవా కేంద్రాలుగా మారుస్తామని చెప్పారు. 500 చదరపు అడుగుల లోపు ఉన్న ప్రతి ఇంటికి మున్సిపల్‌ ‌టాక్స్ ‌రద్దుచేస్తామని, బిఆర్‌ఎస్‌ను అమ లు చేస్తామని, అదనపు గదుల ని ర్మాణానికి క్రమబద్దీకరణ చేస్తామని చెప్పారు.

తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి ఉచితం గా నల్లా కనెక్షన్‌,ఉచిత మంచినీటి సరఫరా,ప్రతి ము న్సిపాలిటిలో అత్యాధునిక సౌకర్యా లతో కూడిన ఇంటర్నెల్‌ ‌రోడ్డు, రోడ్డు డివైడర్లు, అండర్‌ ‌డ్రైనేజీలు, ఎల్‌ఇడి వీధిదీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మున్సిపాలిటీ లో పార్కులు, గ్రీన్‌బెల్టులు, చెరు వుల సుందరీకరణ,బతుకమ్మ ఘా ట్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. ప్రతి మున్సి పాలిటిలో యువతీ యువకులకు వృత్తినైపుణ్యకేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Tags: congress party, puvvalla durgaprasad, sanjeeva reddy bhavan