Take a fresh look at your lifestyle.

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ‌చలో విజయవాడ

ఏపి విజయనరగంలో పోస్టర్‌ ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షుడు

విజయనగరం, ఏప్రిల్‌ 20 : ‌బిజెపి దుర్మార్గమైన బుద్ధితో రాహుల్‌ ‌గాందీపై పార్లమెంట్‌ అనర్హత వేటువేయడంపై దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ ‌నేతలు తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 24వ తేదీన జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ చలో విజయవాడకు కాంగ్రెస్‌ ‌పిలుపునిచ్చింది. ఈ మేరకు కార్యక్రమంనకు సంబంధించిన పోస్టర్స్ ‌విడుదల చేసారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంలో రాహుల్‌ ‌గాంధీకి మద్ధత్తుగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆద్వర్యంలో చేపట్టనున్న విజయవాడ మహాసభకు సంబంధించిన పోస్టర్స్‌ను జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షులు సరగడ రమేష్‌ ‌కుమార్‌ ఆద్వర్యంలో విడుదల చేసారు

.ఈసందర్బంగా రమేష్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ మార్చి 23న సూరత్‌ ‌హైకోర్టు కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు రాహుల్‌ ‌గాంధీ పై పరువు నష్టం కేసు విషయంలో ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.అదే విధంగా పై కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేయడం కోసం రెండు నెలల సమయం ఉన్నప్పటికీ 24న ఎఐసిసి, పిసిసి అధ్యక్షులు ఆదేశాల మేరకు జంకానగర్‌, ‌గాంధీ నగర్‌ ‌దగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆద్వర్యంలో విజయవాడ లో నిర్వహించబడుతున్న మహాసభకు కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు.

Leave a Reply