Take a fresh look at your lifestyle.

విద్యుత్‌ ‌ఛార్జీల పెంపుపై కాంగ్రెస్‌ ‌పోరాటం

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : విద్యుత్‌ ‌చార్జీల పెంపు ఉద్యమ కార్యాచరణకు కమిటీ ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయికి ఉద్యమం తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారని ఆయన మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా నాయకులతో కమిటీ వేసి పనులు అప్పగించండని ఆయన సమావేశంలో కోరినట్లు తెలిపారు. విద్యుత్‌ ‌చార్జీల పెంపు పై క్షేత్ర స్థాయి వరకు ఆందోళనలు వెళ్లేలా ప్లాన్‌ ‌చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టీపీసీసీ కార్యవర్గం పీఏసీ సభ్యులతో సమావేశం జూమ్‌లో నిర్వహించారు.

ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్స్, ‌పలు విభాగాల ఛైర్మన్‌లు, పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వరి, ధాన్యం కొనుగోలు, విద్యుత్‌ ‌చార్జీల పెంపు, పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెంపు, దళిత బంధు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 110 జీఓ పై కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply