Take a fresh look at your lifestyle.

కేసులకు కాంగ్రెస్‌ ‌భయపడదు

  • భద్రాచలం ఎమ్మెల్యేపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి
  • సిఎల్పీ బృందం నేతలు మల్లు భట్టీవిక్రమార్క, రాజగోపాల్‌ ‌రెడ్డి, డి.శ్రీధర్‌ 

కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలు, నాయకులపై కేసులకు భయపడేది లేదని కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకొనేది లేదని, కేసీఆర్‌ ‌ఖబడ్దార్‌ అని సిఎల్పీ నేత భట్టీ విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్చరించారు. మంగళవారం నాడు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య నివాసంలో సిఎల్పీ బృందం నేతలు మల్లు భట్టి విక్రమార్క రాజగోపాల్‌ ‌రెడ్డి, డి. శ్రీధర్‌ ‌బాబులతో పాటు మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌లు విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవంలంభిస్తున్న ధోరణిని సరైన పద్దతి కాదని హెచ్చరించారు. గత నెల 15వ తేది భద్రాచలం కాలనీల్లో ప్రజలకు నిత్యవసరాలు కూరగాయలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో పాటు సుమారు 27 మంది కాంగ్రెస్‌ ‌నాయకులపై పోలీసులు కోవిడ్‌ – 19 ‌కేసు నమోదు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మంగళవారం నాడు ఎమ్మెల్యే వీరయ్యను పరామర్శించారు. ఏజన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనుల ఆకలి కేకలు పట్టని ప్రభుత్వం తమకున్న అధికార బలంతో ఎమ్మెల్యే పేదప్రజలకు చేస్తున్న సహకారాన్ని కేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు. కేసులు పెడితే ఎవరు భయపడవద్దని పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే ప్రగతి భవనను 10 లక్షల మందితో ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఎంతదూరమైన వెళ్ళి ఆదివాసీ ప్రజాప్రతినిధిపై కేసులు ఉపసంహరించుకోకపోతే రాష్ట్రపతి, గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు. కేసులు పెట్టినంతమాత్రాన భయపడి పారిపోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న మార్గదర్శకాలు ప్రకారం ఓ ప్రతిపక్ష పార్టీగా సహకరిస్తూ ప్రజలకు మరింత సేవలు అందిస్తామని అన్నారు. టిఆర్‌ఎస్‌ ‌చేస్తున్న నీచ రాజకీయాలను ఎండగడతామని తెలిపారు. అదేవిధంగా కోవిడ్‌-19 ‌నిబంధనలు పాటించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకుల ఫోటోగ్రాఫ్స్ ‌వీడియో ఫుటేజ్‌లు సాక్ష్యాలతో ఢిల్లీలో జాతీయ విపత్తుల శాఖా కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని కేసీఆర్‌ ‌ప్రభుత్వ ఆలోచన చాలా దుర్మార్గంగా ఉందని రాజకార్ల పరిపాలనను గుర్తు చేస్తున్నారని విమర్శించారు. సిగ్గు శరం లేకుండా అధికార పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా నియంతృత్వ పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. పోలీస్‌, ‌రెవెన్యూ అధికారులు అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకోవద్దని మీ ఉద్యోగ ధర్మాన్ని నిజాయితీగా చేయాలని మీ సేవల ద్వారా అందరితో శబాష్‌ అనిపించుకోవాలని అంతేకాని నిలతీసే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు అధైర్య పడవద్దని కాంగ్రెస్‌ ‌పార్టీ మీ వెనువెంటే ఉంటుందని ధైర్యం చెప్పారు.

రైతులను మోసం చేస్తున్నారు : తెలంగాణ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని సిఎల్పీ బృందం పేతలు బట్టి విక్రమార్క శ్రీధర్‌ ‌బాబు, రాజాగోపాల్‌ ‌రెడ్డిలు మండిపడ్డారు. రాష్ట్రంలో 1.10 కోట్ల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉంటే ఇప్పటివరకు నెల రోజుల్లో కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేసారని గుర్తు చేసారు. ముఖ్యమంత్రి మైకుల ముందు ప్రతీ గింజను మేమే కొంటాం అంటూ అప్రగల్బాలు పలకడం తప్ప చేతల్లో ఏమి ఉండటం లేదని ఎద్దేవా చేసారు. ఇప్పటికే చెడు వానలు వెంటాడుతున్నాయని వచ్చే నెలలో రుతు పవనాలు ప్రవేశిస్తూ 75 శాతం ధాన్యం పరిస్థితి ఏమిటి అని నిలతీసారు. బత్తాయి నిమ్మ , మొక్కజొన్న రైతులను మోసం చేసారని అన్నారు. గన్నీ సంచుల కొనుగోల్లను ప్రభుత్వం చేతివాటం చూపుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో 87,50,000 తెల్లరేషన్‌ ‌కార్డులుంటే 74 లక్షల మందికే 1500 వంల రూపాయలు , 12 కిలోల బియ్యం ఇస్తున్నారని నిలతీస్త్తే మరో 5లక్షల మందికి పోస్టాఫీసుల్లో ఇస్తున్నారని మిగిలిన 7 లక్షల పేదవారు కాదాఅని సూటిగా ప్రశ్నించారు. వీరు గాక గత ఆరేళ్ళుగా దరఖాస్తూ చేసుకున్న అర్హులైన పేదలకు తెల్లరేషన్‌ ‌కార్డులు నేటికి ఇవ్వలేదని ప్రతీ మండలంలోని ఇటువంటి వారు 2వేల మంది ఉన్నారని , మరి వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని కనిపించటం లేదా అని అన్నారు. చేతి వృత్తుల వారికి ఆదుకోవాలని వలస కూలీలను ప్రభుత్వమే స్వంత ఖర్చులతో వారి స్వస్థలాలకు తరలించాలని డిమాండ్‌ ‌చేసారు. సియం సహాయ నిధికి వస్తున్న విరాళాలతో పేదలకు సహాయ కార్యక్రమాలు విసృంతంగా చేపట్టాలన్నారు. జిఓ నె.3 సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపధ్యంలో తెలంగాణ సర్కారు వెంటనే పిటీషన్‌ ‌వేయాలని కోరారు.

Leave a Reply