Take a fresh look at your lifestyle.

అప్పటి మాటేమిటి?

కాంగ్రెస్‌, ‌బిజెపి గోబెల్‌ ‌ప్రచారం చేస్తున్నాయి మంత్రి హరీష్‌రావు
కొండ పోచమ్మ సాగర్‌ ‌కాలువ లీకేజీ పై కాంగ్రెస్‌,‌బీజేపీలు గ్లోబల్‌  ‌ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మండిపడ్డారు. ఆయన బుధవారం గజ్వేల్‌ ‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…చిన్న కాలువ తెగితే పెద్ద రాదత్తం చేస్తున్నారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం  ప్రతిపక్షలు చేస్తున్నాయన్నారు.ప్రంపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ‌కాళేశ్వరం అన్నారు.కాంగ్రెస్స్ ‌హయాంలో ప్రాజెక్టులు సైతం కొట్టుకుపోయిన విషయం మరిచిపోయి మాట్లాడం విడ్డురంగా ఉంద న్నారు. ఎస్సారెస్పీ ఓపెన్‌ ‌చేసినప్పుడు కూడా 131,118 కిలోమీటర్ల వద్ద కాలువ బ్రీచ్‌ అయ్యింద న్నారు.ఖమ్మం జిల్లాలో పాలెం వాగు ప్రాజెక్టు 04, 07,2007 వ రోజు కొట్టుకుపోయిందనీ,ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ‌రెడీ కాకముందే కొట్టుకొనిపోయింది.  దాని నిర్మణంలో లోపం ఉందని అప్పటి కాంగ్రెస్స్ ‌వారు దాన్ని వదిలేశారు.

దేవాదుల ప్రాజెక్ట్ ‌పైపులు పటాకుల లాగా పేలిపోయాయి..అప్పుడు మంత్రులుగా ఉత్తమ్‌, ‌పొన్నాల ఉన్నార నీ గుర్తు చేశారు.గుజరాత్‌ ‌లోని సర్దార్‌ ‌సరోవర్‌ ‌ప్రాజెక్ట్ ‌కాలువలకు  కూడా 200 సార్లు గండి పడింది.ఇటీవలే మనోహరబాద్‌ ‌లో కురిసిన వర్షానికి రైల్వే లైన్‌ ‌తెగి కొట్టుకొనిపోయింది.. దీనికి కారణం ప్రధానమంత్రి అని మేము అంటే బీజేపీ నాయకులు ఒప్పుకుంటారా..?కాంగ్రెస్స్ ‌హయాంలో నీరు,కరెంట్‌ ఇవ్వకుండా రైతులను గోస పెట్టారు. అసాధ్యం అనుకున్న గోదవారి నీటిని తెచ్చి రైతులకు అందించిన ఘనత కేసీఆర్‌ ‌కె దక్కింద న్నారు. కాంగ్రెస్స్ ‌పార్టీ అంటే గ్లోబల్స్ ‌పార్టీ అని ముద్ర పడింది… దీని వల్లే ప్రతి పక్ష హోదా కూడా కోల్పోయింది. కరీంనగర్‌ ‌లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చెరువులు నింపామన్నారు. కొండపోచమ్మ సాగర్‌ ‌కు వచ్చిన కాంగ్రెస్స్, ‌బీజేపీ వారు..  ఆ నీరు నేతి మీద నీళ్లు పోసుకుని… చేసిన తప్పులను ఒప్పుకొని కొండపోచమ్మకు దండం పెట్టండి.సలహాలు ఉంటే ఇవ్వండి..  కానీ బురద చల్లి పోవాలని చూస్తే ఒప్పుకొము.రెండు రోజుల్లో పనులు పూర్తి అవుతాయి… యధావిధిగా నీరు వస్తాయనీ హరీశ్‌ అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply