Take a fresh look at your lifestyle.

రైతుల పొట్టకొట్టి.. కార్పొరేట్లకు దోచి పెట్టేందుకే వ్యవసాయ చట్టాలు

రైతుల ఆందోళనపై కేంద్రం మొండివైఖరి
మండిపడ్డ కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌

వ్యవసాయ చట్టాల ముసుగులో రైతుల పొట్టకొట్టి ఆదానీ, అంబానీలకు దోచిపెట్టే కుట్రను బిజెపి చేస్తుందని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రిసడెంట్‌, ‌మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ ‌విమర్శించారు. రైతులు ఆందోళన చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్ర వైఖరి ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ రెండోసారి అధికారంలోకి వొచ్చి రెండేళ్లు గడిచినా ఎన్నికల హావి•లను నేరవేర్చడంలో విఫలమైందన్నారు. రైతులకు రుణ మాఫీ, డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ఇళ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీలాంటి ఆంశాలను పూర్తిగా విస్మరించిందన్నారు. వొచ్చే మూడేళ్లలో కూడా వీటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. జీఎస్టీతో సహా ఇటీవల కేంద్రం అమలులోకి తీసుకువొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను సీఎం కేసీఆర్‌ ‌వ్యతిరేకించలేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాల్లో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌పార్టీలు ఒక్కటేనని..అందుకే పలు ఆంశాల్లో ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయని పొన్నం ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో రాజీ కోసమే సీఎం కేసీఆర్‌ ‌ఢిలీల్లో పర్యటించారన్నారు.

 

సీఎం కేసీఆర్‌ ‌ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసమా.. లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంతో పాటు మొన్న జరిగిన జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నాయకత్వాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలతో ఎదురుదాడిలు చేసుకున్న తరుణంలోనే  ఢిల్లీకి కేసీఆర్‌ ‌వెళ్ళడం, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు ఒక్క రోజులోనే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

Leave a Reply