Take a fresh look at your lifestyle.

నంద్యాల వ్యవసాయ కేంద్రాన్ని తరలించవద్దు

ఈ భూములను బదిలే చేస్తే ఊరుకునేది లేదు
కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌తులసిరెడ్డి హెచ్చరిక
నంద్యాల,జూలై 17 : నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ భూముల జోలీకి వస్తే సహించేది లేదని ఊరుకునేది లేదని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌తులసిరెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నంద్యాల పార్లమెంట్‌ ‌జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ డీసీసీ అధ్యక్షులు జె. లక్ష్మీ నరసింహ యాదవ్‌తో కలసి శనివారం స్థానిక నంద్యాలలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్యర్యంలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన భూములను పరీశీలించారు. అనంతరం అక్కడ పని చేసే ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం1906 సంవత్సరంలో ప్రత్తి పరిశోధనా స్థానంగా ఏర్పాటు అయ్యింది. భారత దేశ స్వాతంత్య్ర రాకముందే బ్రిటిష్‌ ‌ప్రభుత్వంలో ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటు అయ్యింది. ఈ పరిశోధన స్థానం గత 115 సంవత్సరాల కాలంలో ప్రత్తి పరిశోధనా స్థానంగా, అత్యల్ప వర్షపాత మండల పరిశోధన స్థానంగా, ప్రాంతీయ పరిశోధనా స్థానంగా రూపాంతరం చెంది మానవాళికి ఎనలేని సేవ చేస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన పంట రకాల పరిశోధనా ఫలితాలను ఈ కేంద్రం రూపొందించింది. ఈ పరిశోధనా స్థానం కృషితో అభివృద్ధి చేసిన పలు పంటల రకాలు రైతులు అభివృద్ధికి తోడ్పడంతోపాటు జాతీయ అవసారాలకు కావాల్సిన వ్యవసాయ ఉత్పాదన సాధనలో అత్యుంత కీలకమైన పాత్ర వహించాయి.

అధిక దిగుబడి పంట రకాలతో పాటు ఉత్తమ యాజమాన్యం, పురుగు ,తెగులును తట్టుకొనే నూతన సాంకేతికత విధానాలను ఈ పరిశోధనా స్థానం అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నది. దీని ద్వారా రైతుకు పంట సాగులో వేల కోట్ల రూపాయల అదనపు ఖర్చును తగ్గించి లాభసాటి వ్యవసాయం వైపు దిశా నిర్ధేశంచేస్తున్నదని తులసిరెడ్డి వివరించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారి నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నందు మధ్యస్థకాలిక విత్తన బీజనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని పంటల బీజ భద్రత చేస్తున్నారు. ఇది రాబోయే తరాలకు విత్తన రక్షణ కేంద్రముగా అభివృద్ధి జరుగుతున్నది. వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాలలో ఉండుట వలన ఈ ప్రాంతం విత్తన ఉత్పత్తి దారులకు మార్గదర్శకంగా మారింది. అదేవిధంగా నైపుణ్యము ఉన్న విత్తనోత్పత్తి రైతులు మరియు గ్రామాలు అభివృద్ధి చెందాయి. దీనితో ఈ ప్రాంతం విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందటంతో రైతుల ఆదాయం పెరగడంతో పాటు, అనేక ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధికి దోహదం పడుతున్నది. సంస్థ భూములను వైద్య కళాశాల ఏర్పాటుకు కేటాయించిన భూములకు బదులుగా నూతన స్థానంలో కేటాయించిన భూములలో వ్యవసాయ పరిశోధనా స్థానం ఏర్పాటుతో వ్యవసాయ రంగానికి జరిగే నష్టం పై, ఈ నష్ట నివారణకు ఉన్న మార్గాలపై కూడా రాయలసీమ ప్రజానీకానికి అవగాహనకై క్రింద సంక్షిప్త సమాచారం పొందపర్చడమైనది.

నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానంను వేరొక ప్రాంతానికి మార్చడం వలన పరిశోధనలకు కొనసాగింపులో అంతరాయం వలన నూతన విత్తానాల అభివృద్ధికి తీవ్ర విఘాతం జరుగుతుందన్నారు. పరిశోధనా స్థానంను ఇంకొక ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే మౌళిక వసతుల కల్పనకు చాలా సంవత్సరాల సమయం పట్టడంతో విత్తన పరిశోధన అభివృద్ధిలో తిరిగి కోలుకోలేని నష్టం జరుగుతుందన్నారు. పరిశోధనా స్థానంను ఇంకొక ప్రదేశంలో ఏర్పాటు చేయాలనుకుంటే మౌళిక వసతుల ఏర్పాటుకు, భూమిని పరిశోధనలకు అనుకూలంగా అభివృద్ధి చేసుకొనడానికి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ప్రజా ధనం దుర్వినియోగం చేయడం ఏ మాత్రం తగదన్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా ఇది వాంఛనీయం కాదన్నారు. వ్యవసాయ పరిశోధనలలో అంతరాయం వలన రైతులు విత్తనాలకై బహుళజాతి విదేశీ సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో ఎక్కువ ధరలకు విత్తనాలు కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.5.. మన నేల, మన విత్తనం, మన రైతన్నల కృషి తో దేశం ఆహారభద్రత సాదించింది.

దీనితో అంతర్జాతీయ ఒత్తిడులకు లోను కాకుండా, స్వతంత్ర నిర్ణయాలతో మన దేశం అణుశక్తిని అభివృద్ధి చేసుకోగలిగింది. విత్తన పరిశోధన స్థానాలను నిర్వీర్యం చేస్తే నూతన విత్తనాల అభివృద్ధి జరగక, విత్తనాలకై విదేశీ బహుళజాతి సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. పరిశోధనా స్థానం ఇంకొక ప్రదేశంలో ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో వైద్య కళాశాలకు అవసరమైన భూములను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఈ భూముల జోలికి వస్తే సహించేది లేదని రాష్ట్ర స్థాయిలో ఉద్యమించ డానికయిన సిద్ధంగా ఉన్నామని తులసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు దాసరి చింతలయ్య,ట్రెజరర్‌ ‌టీచర్‌ ‌ప్రసాద్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకులు ఫరూక్‌, ‌రాష్ట్ర అధికార ప్రతినిధి వాసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.మోహన రావు, రహమాన్‌, ఆర్‌ ‌టి సి ప్రసాద్‌ , ‌శివరాం రెడ్డి, గంధం మల్లేశ్వరెడ్డి, రుద్రావరం మండల అధ్యక్షులు శ్రీనివాస యాదవ్‌ శ్రీ‌శైలం ఇస్మాయిల్‌, ‌జిల్లా యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు విజయ్‌ ‌యాదవ్‌,‌రమణ, ఎల్లమ్మ, అమర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply