- పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగు పర్చుకోవడంలో మోడీ సర్కార్ విఫలం
- ఎన్నికలు వచ్చినప్పుడల్లా మన జవానులు బలి కావాల్సిందేనా?
అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్ష – వీరాజవాన్లకు నివాళి, కుటుంబాలను ఆదుకోవాలి చైనా ఘాతుకానికి బలైన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది అమరవీర జవానులను స్మరించుకుంటూ ‘‘అమరవీరులకు కాంగ్రెస్ సలాం’’కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ సెంటర్లో భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించారు. ఈ సందర్భం గా కాంగ్రెస్ వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ చైనా వెంటనే భారత్ విడిచిపో (గోబ్యాక్ చైనా) అని నినదించారు. ప్రధాని మోడీ వివిధ దేశాలు తిరుగుతూ దౌత్య సంబంధాలు మెరుగు పర్చుతున్నట్టు చెబుతున్న మాటలు ఆచరణలో సాధ్యం కావడం లేదన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలు నిత్యం జరుగుతున్న సంఘటనలతో అర్ధం అవుతున్నదని, ఈ విషయంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు రాబోతున్న ఎన్నికలకు ముందు పొరుగు దేశాలతో జరిగే ఘర్షణల్లో మన సైనికులు మరణించడం అనుమానాలకు తవిస్తున్నదని,ఈ పేరిట బిజెపి రాజకీయం చేస్తుదన్నారు. దేశ రక్షణ కోసం చైనాతో జరిగిన పోరాటంలో అమరులైన 20మంది వీర జవాణులకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నివాళులర్పిస్తుందని, వీర జవానుల కుటుంబాలని కేంద్రం అన్ని విధాల ఆదుకుని అండగా ఉండాలన్నారు. ప్రతి అమర జవాను కుటుంబానికి రూ.5 కోట్లు సహాయం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.
భారత్ చైనా సరిహద్దులోని వాస్తవ పరిస్థితులను మోదీ వెల్లడించాలని, పరిస్థితులను యధాస్థితికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. యావత్ భారత ప్రజలందరూ భారత ఆర్మీ త్యాగాలను గుర్తించి వెంట ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ అద్యక్షుడు కట్ల శ్రీనివాస్ రావు, టిపిసిసి అధికార ప్రతినిధి మహ మ్మద్ రియాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తక్కళ్ళపల్లి రాంమోహన్ రావు, గ్రేటర్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, ప్రొఫెషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు పులి అనిల్ కుమార్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్వాల కార్తీక్, యువజన కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ తోట పవన్, డివిజన్ అధ్యక్షుడు గాండ్ల స్రవంతి, సురేందర్, గ్రేటర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ సమ్యద్, ఆసగం కల్యాణ్, గ్రేటర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు బొంత సారంగం, కోడిపాక గణేష్, అజగర్, జామీరుద్దీన్, మహమ్మద్ జాఫర్, బందరి జనార్దన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.