Take a fresh look at your lifestyle.

సెప్టెంబర్‌ 7 ‌నుంచి షరతులతో.. మెట్రో రైలు ప్రయాణానికి అనుమతి

విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, ప్రదర్శనా స్థలాలకు నో
అన్‌ ‌లాక్‌ 4 ‌మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం 

అన్‌ ‌లాక్‌ 4‌కు కేంద్రం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. మరికొన్ని కార్యకలాపాలకు అనుమతులిస్తూ ప్రకటన విడుదల చేసింది. వీటిలో పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు నిచ్చింది. కంటైన్మెంట్‌ ‌జోన్లు మినహా ఈ అనుమతులు సెప్టెంబర్‌ 1 ‌నుండి అమలులోకి రానున్నాయి. సెప్టెంబర్‌ 7 ‌నుంచి కొన్ని షరతులతో మెట్రో రైళ్ల ప్రయాణానికి అనుమతి లభించింది. సెప్టెంబర్‌ 21 ‌నుంచి 100 మందికి మించకుండా అన్ని సామూహిక కార్యక్రమాలు..పెళ్లిళ్లు, రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించుకోవొచ్చు. ఈ సమావేశాల్లో కోవిడ్‌ 19 ‌నిబంధనలు..మాస్క్, ‌భౌతిక దూరం, థర్మల్‌ ‌స్క్రీనింగ్‌, ‌సానిటయిజేషన్‌ ‌లాంటివి తప్పక పాటించాలి. ఓపెన్‌ ఎయిర్‌ ‌థియేటర్లు  1 సెప్టెంబర్‌ ‌నుంచి నడుపు కోవొచ్చు. 30, సెప్టెంబర్‌ ‌వరకు విద్యా సంస్థలను తెరవడానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌ ‌లైన్‌ ‌బోధనను ప్రోత్సహించాలని ప్రకటనలో పేర్కొంది.

ఓపెన్‌ ఎయిర్‌ ‌థియేటర్లు మినహా సినిమా థియేటర్లకు, ఇతర ప్రదర్శనా స్థలాలకు, స్విమ్మింగ్‌ ‌పూల్స్ ‌మినహా కంటైన్మెంట్‌ ‌లేని ప్రాంతాల్లో కూడా కేంద్రం అనుమతి నిరాకరించింది. లాక్‌ ‌డౌన్‌ను సెప్టెంబర్‌ 30 ‌వరకు పొడిగిస్తున్నట్లు విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం మరికొన్నాళ్ల పాటు కొనసాగిస్తామని, అంతర్రాష్ట ప్రయాణాలకు నిబంధనలను తొలగించినట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని పేర్కొంది. అయితే సెప్టెంబర్‌ 30 ‌వరకు కంటైన్మెంట్‌ ‌జోన్లలో ఆంక్షలు కొనసాగనున్నట్లు కేంద్రం తెలిపింది. కంటైన్మెంట్‌ ‌వెలుపల స్కూళ్ళల్లో 9 నుంచి 12వ తరగతి వరకూ విద్యార్థులను స్కూలుకు పిలవవచ్చు అయితే అది స్వచ్ఛందంగా వారు రాదల్చుకుంటే మాత్రమే కంటైన్మెంట్‌ ‌జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్య సేతు యాప్‌ను తప్పని సరిగా ప్రతి ఒక్కరు ఉపయోగించాల్సి ఉంటుంది.

Leave a Reply