Take a fresh look at your lifestyle.

సోషల్ మీడియా లో గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టండి 

 

*ఎన్నారై లకు మంత్రి హరీష్ రావు పిలుపు

టిఆర్ఎస్ ఎన్నారై లతో దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు  సిద్దిపేట మంత్రి నివాసం నుండి  విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార సరిలీ ని వివరిస్తూ.. దుబ్బాక అభివృద్ధి  సంక్షేమం పై చెప్పారు.. వారికి దిశానిర్దేశం చేసారు.. ఈ సందర్భంగా హరీశ్ రావు గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నారైల పాత్ర ఎంతో గొప్పదనీ .. టి ఆర్ ఎస్ ఎన్నారై లు సోషల్ మీడియా లో గోబెల్స్ ప్రచారాలని తిప్పి కొట్టి దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో ఎన్నారైలు అందరూ క్రియాశీలక  పాత్ర నిర్వహించాలి అని కోరారు .ఉద్యమ సందర్భంలో తన అమెరికా , యు కె ఎన్నారైలతో కలిసి పని చేసిన సందర్భాన్ని గుర్తుచేశారు.తెలంగాణ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా మేధావుల అందర్నీ కూడగట్టడంలో ఎన్నారైల పాత్ర ఎంతో గొప్పదనీ  ఎప్పుడు మరిచిపోలేము అని అన్నారు.దుబ్బాక పూర్తిస్థాయిలో వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం చిన్న మున్సిపాలిటీ అని వివరిస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో ఇటీవలే మరణించిన ఎమ్మెల్యే రామ లింగ రెడ్డి పాత్రను, జీవితమంతా ఉద్యమాల్లో ప్రజా పక్షాన నిలిచిన వ్యక్తి విద్యార్థి నాయకుడిగా ,  వామపక్ష భావాలతో ప్రజా సేవ చేసిన వ్యక్తి రాంలింగన్న.. కొనియాడారు. ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై టి.ఆర్.యస్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసారి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, సిక్కా చంద్రశేఖర్, టి.ఆర్.యస్ న్యూజీలాండ్  వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ భాస్కర్  రెడ్డి కొస్నా మరియు 30 కి పైగా దేశాల ఎన్నారై టి.ఆర్.యస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
A

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply