Take a fresh look at your lifestyle.

ఆపరేషన్‌ ‌ప్రహార్‌ను ఖండించండి

  • సైనిక దాడులకు నిరసనగా 26న భారత్‌ ‌బంద్‌
  • ‌లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌

ఆపరేషన్‌ ‌ప్రహార్‌ ‌సైనిక దాడులను ఓడించాలంటూ, సైనికదాడులకు నిరసనగా ఏప్రిల్‌ 26‌వ తేది సోమవారం నాడు భారత్‌ ‌బంద్‌కు పిలుపునిచ్చినట్లు, అన్ని వర్గాల ప్రజలు బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చినట్లు శుక్రవారం నాడు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ ‌విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదుల దలారి పెట్టుబడిదారుల ఆదేశానుసారం జల్‌, ‌జంగల్‌, ‌జమీన్‌, ‌ఖనిజ సంపదను దోచుకోవడానికి అడ్డుగా ఉన్న మావోయిస్టు పార్టీని అణచివేయడానికి సమాధాన్‌  ‌దాడిలో భాగంగానే ప్రహార్‌ ‌సైనికదాడిని 2019 డిసెండర్‌ ‌నుండి మొదలుపెట్టారని లేఖలో పేర్కొన్నారు. 2020 నుండి ఇప్పటివరకు ఈదాడిలో దేశ వ్యాప్తంగా 300లకు పైగా ప్రజలను టిఎల్‌జిఏ సభ్యులను, కమాండర్స్ ‌వివిధ స్థాయిలలో ఉన్న కామ్రేడ్స్‌ను బూటకపు ఎన్‌కౌంటర్లు ఎన్‌కౌంటర్లలో చిత్రహింసలు, విషప్రయోగాల ద్వారా పోలీస్‌ ‌బలగాలు హత్య చేసాయని లేఖలో పేర్కొన్నారు. దండకారణ్యంలో 150 మందికి పైగా మావోయిస్టులను హత్య చేసారని పేర్కొన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం 10 మంది విప్లవకారులను పట్టుకుని బూటకపు ఎన్‌కౌంటర్‌ ‌పేరుతో హత్య చేసిందని జగన్‌ ‌లేఖలో పేర్కొన్నారు. మార్చి 31 , ఏప్రిల్‌ 1‌వ తేదీన తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాలలో హక్కుల సంఘాల ప్రజాస్వామిక వాదుల, వివిధ సంఘాల నాయకుల, కార్యకర్తల 31 మంది ఇండ్లను సోదా చేసి ఇళ్లలోని సామాన్లు అన్నీంటిని దోచుకుపోయారని లేఖలో పేర్కొన్నారు. ప్రశ్నించిన గొంతుకలను మూసివేస్తున్నారని లేఖలో వివరించారు. వయోవృద్ధులైన వరవరావును విడుదల చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు తిరుగుబాటు చేయటంతో గత్యంతరంలేని పాలకులు అనేక షరతులతో తాత్కాలికంగా జైలు నుండి విడుదల చేసారని లేఖలో పేర్కొన్నారు. 2020 అక్టోబర్‌ 5‌న జాతీయ భద్రతా సలహాదారులు విజయ్‌కుమార్‌ ‌నాయకత్వంలో తెలంగాణ డిజిపి సహా ఐదు రాస్ట్రాల పోలీస్‌ అధికారులతో కలిసి తెలంగాణలోని వెంకటాపురంలో కేంద్ర స్థాయి సైనిక దాడికి పథకం రచించారని జగన్‌ ‌లేఖలో అన్నారు. ఏప్రిల్‌ 3‌వ తారీఖున దాడికి వొచ్చిన 2వేల మంది కోబ్రా ఎస్‌టిఎఫ్‌, ‌డిఆర్‌జి, బస్తల్‌ ‌బెటాలియన్‌ ‌బలగాలపై పిఎల్‌జిఏ ప్రతిదాడి జరిగిందని తెలిపారు. 25 మంది పోలీసులు చనిపోయారని లేఖలో పేర్కొన్నారు. 31 మంది పోలీసులు గాయపడ్డారని మావోయిస్టులు నలుగురు అమరులయ్యారని లేఖలో పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం బ్రాహ్మణీయ హిందూ రాజ్యస్థాపన లక్ష్యంతో మావోయిస్టులు లేని నవభారతులు నిర్మిస్తామంటూ మోడీ, అమీత్‌షాలు ప్రకటన చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కొరోనా ముసుగులో ప్రజావ్యతిరేక చట్టాలను అనేకం చేసారని లేఖ ద్వారా వెల్లడించారు. వాటిని అమలు చేయడానికి ఫాసిజాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతాంగాన్ని పూర్తిగా లూటీ చేయడానికి ఆదానీ, అంబానీ సామ్రాజ్యవాద కార్పొరేట్ల లాభాల కోసం ప్రమాదకరమైన మూడు నూతన  వ్యయసాయ చట్టాలను ఆమోదించడంతో భారత రైతాంగం ఉవ్వెత్తున లేచి పోరాడుతుందని లేఖ ద్వారా పేర్కొన్నారు.

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం హరితహారం ఓసిలు, అభయారణ్యాలు, ధరణి పోర్టుల పేరుతో ఆదివాసీల భూములను ఆక్రమిస్తూ కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. ఆపరేషన్‌ ‌గ్రీన్‌హంట్‌ , ‌సమాధాన్‌ ఆపరేషన్‌ ,‌ప్రహార్‌ ‌వరకు అనేక అణచివేత క్యాంపింగ్‌లను ప్రజలు ఎదుర్కుంటూ భారత విప్లవజ్ఞులు పురోగమిస్తుందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26వ తేదీన బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ ‌పిలుపునిచ్చారు.

Leave a Reply