Take a fresh look at your lifestyle.

68 ‌మంది వైద్య సిబ్బందికి కొరోనా వైద్య బృందాల్లో ఆందోళన

తెలంగాణలో కరోనా బారిన పడిన డాక్టర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉస్మానియాలో 41 మంది డాక్టర్లు, గాంధీలో నలుగురు డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. నిమ్స్‌లో 12మంది డాక్టర్లు, 8 మంది పారమెడికల్‌ ‌స్టాఫ్‌ ‌కరోనా బారిన పడ్డారు. అలాగే డెంటల్‌ ‌విద్యార్థులు ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో మొత్తం 68 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా పొజిటివ్‌గా తేలింది. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ భద్రత కల్పిస్తామని నిమ్స్ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌.‌కె.మనోహర్‌ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యులతోపాటు సిబ్బందికి, కార్మికులకూ కోవిడ్‌ ‌పరీక్షలు, చికిత్స అందిస్తామన్నారు.  కార్మికుల సహా అందరికీ మాస్క్‌లు, గ్లౌజ్‌లు, అవసరమైన వారికి పీపీఈ కిట్లను అందజేస్తామన్నారు.  హైపోక్లోరైడ్‌ ‌స్పే చేయిస్తున్నాం.

శానిటైజ్‌ ‌సదుపాయాన్ని కల్పిస్తున్నాం. కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కరోనాతో అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను అందించే నిమ్స్ ఆస్పత్రి విలవిలాడుతున్నది. ఫలితంగా ప్రొఫెసర్లు, రెసిడెంట్‌ ‌డాక్టర్లు, వైద్య సిబ్బంది, కార్మికులు వైరస్‌ ‌బారిన పడుతున్నారు. వైద్యులకు నిమ్స్‌లోనే వైద్యం అందించి.. తమకు బయటి ఆస్పత్రుల్లో చికిత్స ఇప్పిస్తుండటంపై సిబ్బంది, కార్మికులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే పది మందికిపైగా వైద్యులు చికిత్స పొందుతున్నారు. మరో 20 మందిని •ం క్వారంటైన్‌కి సిఫార్సు చేశారు. డాక్టర్స్ ‌క్లబ్‌లోని రెసిడెంట్‌ ‌డాక్టర్లందరూ వైరస్‌ ‌లక్షణాలతో బాధపడుతున్నట్టు విశ్వనీయ సమాచారం. దీంతో యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూడు కీలకమైన విభాగాలలోని వైద్యులు, సిబ్బంది, కార్మికుల నమూనాలను సేకరించినట్టు సమాచారం. ఈ క్రమంలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల నుంచి 20 మంది చొప్పున నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply