Take a fresh look at your lifestyle.

జ్వరాలపై ప్రజల్లో ఆందోళన

అనవసర ప్రచారాలు తగవన్న వైద్యులు
ఏలూరు,సెప్టెంబర్‌ 20 : ‌గున్యా లేదా డెంగీ జ్వరాలపై ప్రజలను  భయభ్రాంతులకు గురి చేయవద్దని  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హెచ్చరించారు. జ్వరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రైవేట్‌ ‌వైద్యశాలలు తమ స్వార్థం కోసం ప్రజలను ఆందోళనకు గురిచేయవద్దన్నారు. డెంగీ అని నిర్ధరణ కాకున్నా రోగులను భయాందోళనకు గురిచేసే ఆసుపత్రుల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు.

జ్వరాలన్నీ డెంగీ కాదన్నారు. జ్వర పీడితులను గుర్తించి రక్తనమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వారికి ఉచితంగా వైద్య సేవలందేలా చూస్తామన్నారు. గ్రాణ ప్రాంతాల్లోనూ ఆరోగ్య కార్యకర్తలను ఇంటింటికి పంపించి జ్వరాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజలు కూడా పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఇదిలావుంటే జిల్లాలో గిరిజన ప్రాంతాలు మన్యం మొదలు డెల్టా ప్రాంతాల వరకు ప్రతిచోటా వివిధ రకాలు రోగాలు, జ్వరాలతో బాధపడుతున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, అంతకు ముందు వాతావరణ పరిస్థితులు దీనికి కారణమని ప్రభుత్వంతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు  పేర్కొన్నారు. వీరికి ప్రభుత్వపరంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సహకారం అందించారు.

జిల్లాఅంతటా చాలా ప్రాంతాల్లో తాగునీటి నిర్వహణ చాలా లోపభూయిష్టంగా ఉండడమే ఇందుకు కారణమన్నారు. •ఖటిలో ప్రమాదకరమైన సుమారు పలురకాల  వైరల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ నీటిలో మలేరియా, టైఫాయిడ్‌, ‌కామెర్లు వంటి రోగాలు రావడానికి చాలా బలమైన కాలుష్యాలు కలుస్తున్నాయి.  ప్రజలు కొనుగోలు చేసి తాగుతున్న మినరల్‌ ‌వాటర్‌ ‌బాటిళ్ల నీటిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.  సరిగా ప్యూరిఫై చేయకపోవడమే దీనికి కారణమని బృందం సభ్యులు అభిప్రాయపడ్డారు. నీటిలో అమిబియాసిస్‌ ఎక్కువగా ఉందని వారంటున్నారు. దీంతోపాటు ఏజన్సీ ప్రాంతంలో దోమ పోటు చాలా ఎక్కువగా ఉందని, దీనిని నివారించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

జిల్లాలో అనేకులు టైఫాయిడ్‌, ‌మలేరియా, కామెర్లు, వివిధ రకాల వైరల్‌ ‌జ్వరాలు, ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్నారు. తాగునీటి విషయంలో పాలకొల్లు, తణుకు మున్సిపాల్టీలు కాస్త మెరుగ్గా పని చేస్తున్నాయని పరిశీలనలో వెల్లడైంది. పారిశుధ్యం మెరుగుపరుస్తూ తాగునీటి సరఫరా విషయంలో తక్షణం ప్రభుత్వపరంగా సరైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply