Take a fresh look at your lifestyle.

కొరోనాతో ఇప్పటికే 700 మందికి పైగా వైద్యుల మృతి వైద్య సిబ్బందిలో ఆందోళన

అం‌తర్జాతీయ వైద్య ప్రమాణాలతో కూడిన ఎయిమ్స్ ‌తదితర హాస్పిటళ్లలో కొరోనా వైరస్‌ ‌కారణంగా వైద్య సిబ్బంది ఆందోళనలకు గురవుతోంది. అనేక హాస్పిటళ్లలోని వైద్యులు, పారామెడికల్‌ ‌సిబ్బంది, ఉద్యోగులు వైరస్‌ ‌బారినపడుతున్నారు. ఇప్పటికే కొరోనా వైరస్‌ ‌కారణంగా దేశవ్యాప్తంగా 700కు పైగా వైద్యులు మరణించినట్లు వివరాలు వెల్లడిస్తుస్తున్నాయి. ప్రధానంగా నగరాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు ఇలా అంతా వైరస్‌ ‌బారిన పడి ఆందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో వైద్యులు, పారామెడికల్‌ ‌సిబ్బంది ఐసోలేషన్‌ ‌వార్డులో చికిత్స పొందుతున్న వారు కూడా ఉన్నారు. వీరిలో చాలా వరకు వైరస్‌ ‌ప్రభావం తీవ్రత తగ్గుముఖం పట్టడంతో హోమ్‌ ‌క్వారంటైన్‌కు వెళ్లారు. క్యాథ్‌లాబ్‌, ‌కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు వొచ్చిన రోగుల ద్వారానే వైరస్‌ ‌సోకినట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. 75 శాతం మేరకు కొరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ క్రమంలో చికిత్సలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి వైరస్‌ ‌సోకే ప్రమాదం లేకపోలేదని, ఆ దిశగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినిహా చేయగలిగినదేవి• లేదని ఓ జూనియర్‌ ‌డాక్టర్‌ ‌పేర్కొన్నారు. వైరస్‌ ‌కారణంగా మరణాలు సంభవించడం వారిని ఆందోళనకు గురిచేస్తున్నది. పాజిటివ్‌గా నమోదైన వైద్యులు, పారామెడికల్‌ ‌సిబ్బందిలో చాలా వరకు హాస్పిటల్‌ ఐసోలేషన్‌ ‌వార్డు నుంచి హోం క్వారంటైన్‌కు వెళుతున్నారు. కానీ వైద్యులు సైతం భయం భయంగానే వైద్య సేవలందిస్తున్నారని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. మరో పక్క ఆపరేషన్‌ ‌థియేటర్లలో కూడా వైరస్‌ ‌వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదని ఓ సీనియర్‌ ‌వైద్యుడు పేర్కొన్నారు.

ఏదైనా ఆపరేషన్‌ ‌జరిగిన సందర్భంగా అక్కడున్న వైద్యులంతా కలిసి ఒకే చోట భోజనం చేయడం పరిపాటి. ఆ సమయంలో మాస్కులు ఉండవు. దాని వల్ల కూడా వైరస్‌ ‌వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదంటున్నారు. దీంతో వెద్యులందరికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొరోనా పరీక్షలు నిర్వహించడం, వారికి టీకా వేయించడం జరిగింది. వైద్యులతో పాటుగా పారామెడికల్‌ ‌సిబ్బంది, ఉద్యోగులకు సైతం ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే శస్త్ర చికిత్సలను నిలిపివేసారు.

Leave a Reply