Take a fresh look at your lifestyle.

రవాణా శాఖ కార్యాలయాల్లో స్లాట్‌ల కుదింపు

కొరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర రవాణా శాఖ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కొవిడ్‌ 19 ‌పరిస్థితుల దృష్ట్యా ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే వినియోగదారులపై ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా ఇకపై ప్రతీ ఆర్టీఏ కార్యాలయంలో సాధారణ రోజుల్లో ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేవలం 50 శాతం స్లాట్‌లను మాత్రమే అనుమతిస్తారు. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా చూడవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే ప్రతీ వాహనదాదరుడు తప్పనిసరిగా మాస్క్ ‌ధరించేలా నిబంధన విధించారు. మాస్క్ ‌లేకుండా వస్తే వాహనాల రిజిస్ట్రేషన్‌తో పాటు ఎలాంటి సేవలనూ అనుమతించరు. కార్యాలయంలోనికి వచ్చిన ప్రతీ వ్యక్తికీ థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ‌నిర్వహించిన తరువాతనే లోనికి అనుమతిస్తారు. అలాగే వ్యక్తుల మధ్య 6 అడుగుల భౌతిక దూరం పాటించేందుకు అన్ని చోట్లా మార్కింగ్‌ ‌చేస్తారు.

అందుబాటులో శానిటైజర్లను కూడా ఉంచుతారు. వాహనదారులు నిర్దేశించిన స్లాట్‌ ‌ప్రకారమే రావాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఆలస్యంగా వచ్చినా ఆ వ్యక్తి స్లాట్‌ను రద్దు చేస్తారు. నిర్దేశించిన సమయానికి ముందే కార్యాలయానికి వచ్చినా అనుమతించరు. అలాగే, ఆర్టీఏ కార్యాలయానికి ఏ సేవల నిమిత్తం వచ్చినా దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తారు. దరఖాస్తు చేసుకున్న వారు మినహా ఇతరులెవరినీ అనుమతించరు. దివ్యాంగులు, సీనియర్‌ ‌సిటిజన్‌లు మాత్రం సహాయకులను వెంట తెచ్చుకోవచ్చు. కాగా, గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీయే కార్యాలయాల్లో స్లాట్‌ల కేటాయింపు ప్రారంభమైంది. లాక్‌డౌన్‌కు ముందు స్లాట్‌లను నమోదు చేసుకుని ఫీజులు చెల్లించిన వారికి రానున్న వారం రోజుల్లో దశలవారీగా సేవలను అందజేయనున్నారు. లర్నింగ్‌ ‌లైసెన్సు కాలపరమితి ముగిసి లాక్‌డౌన్‌ ‌కారణంగా పర్మనెంట్‌ ‌డ్రైవింగ్‌ ‌లైసెన్సు పరీక్షలకు హాజరు కాలేకపోయిన వారికి కూడా లెర్నింగ్‌ ‌లైసెన్సుల గడువును పొడిగించనున్నారు.

Leave a Reply