ఐటిడిఏలోని వివిధ విభాగాలలో పనిచేయుచున్న యూనిట్ అధికారులు తమకు ప్రతిపాదించిన ఆదివాసీ గిరిజ నులకు సంబంధించిన సంక్షేమ పథకాలు సొసైటీలకు ఉపాధి కల్పించే పనులకు సకాలంలో పూర్తి అయ్యేల చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ పిఓ గౌతమ్ పొట్రూ యూనిట్ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం నాడు తన చాంబర్లో యూనిట్ అధికారులతో శాఖల వారిగా ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిసిసి మరియు వ్యవసాయ శాఖకు సంబంధించిన గోడౌన్ నిర్మాణ పనులు డియంజిసిసి దగ్గర ఉండి పనులు సక్రమంగా జరుగుచున్నవి లేనిది చూసి పనులు మన్నికంగా ఉన్నది లేనిది చూసి ఏఇ సర్టిఫై చేసిన తరువాత నిధులు విడుదల చేయాలని ఈ నెల 15వ తేది వరకు ప్రారంభించేల పనులు పూర్తి చేయాలని డియంజిసిసికి ఆదేశించారు. ప్రస్తుతం జిసిసి తరుపున నడుపబడుచున్న పెట్రోలు పంపులు బాగా నడిచేల సిబ్బందిని ప్రోత్సహించేల కొత్త పెట్రోల్ పంపు నిర్మాణానికి దమ్మపేట, మణుగూరు , ఇల్లందు , అశ్వాపురం పేట ,ఎన్కూరు , జూలూరుపాడు , కొతత్తగూడెం మండలాల్లో పెట్రోలు పంపులు నిర్మాణానికి ప్రభుత్వంనకు సంబంధించిన భూములు గుర్తించాలని డియంజి•సి కి ఆదేశించారు. యంఎఫ్ తరుపున ప్రారంభించేల న్యూట్రిబిస్కెట్స్కు సంబంధించి చిన్న మరమత్తులు త్వరితగతిన పూర్తి చేయాలని ఏడిఏ కు ఆదేశిస్తూ హాస్టల్కు ఆశ్రమ పాఠవాలకు మూడు నెలలకు సరిపడ కందిరపప్పు ప్రతిపాదనలు సమర్పించాలని డిడిటిడబ్ల్యూకు ఆదేశించారు. ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలకు ఖాళీగా ఉన్న ప్రదేశాలు దగ్గరలోనున్న జిపి నర్సీరీల అందమైన పూలమొక్కలు నాటించి వాటి సంరక్షణ భాధ్యత హెచ్యం చూసుకునేల చూడాలని డిడిడబ్య్లూకు ఆదేశించారు.
ఓక్స్ యాప్ ద్వారా గిరిజన విద్యార్ధులు ఆన్లైన్ పాఠాలు సక్రమంగా వీక్షించి అవగాహన చేసుకున్నది లేనిది యంఆర్వో సిబ్బంది పర్యవేక్షించాలని అన్నారు.ఆన్లైన్ భోధిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్దుకు అర్ధమయ్యేల రీతీలో భోధించేల సలహాలు, సూచనలు, పియంఆర్సి సిబ్బంది వారికి తెలియచేయాలని అన్నారు. అదేవిధంగా శానీటైరీ నాప్కీన్లకు సంబంధించిన మిషన్ చెడిపోతే దానికి సంబంధిత అయ్యే ఖర్చు సంబంధిత నాప్కీన్ తయారు చేసే మహిళలే భరించాలని అన్నారు. అన్నీ పాఠశాలలకు బల్లలు చేరినతరువాత సంబంధిత డిఇఓ తో సర్టిఫై చేయించాలని జెడియంకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఓ బీమ్, డిడిటిడబ్ల్యూ జహీరుద్దీన్, ఇఇటిడబ్ల్యూ రాములు, డియంజిసిసి కుంజా వాణి, ఏపిఓ అనురాధ, ఏడిఏ సుజాత, హెచ్ఓ ప్రకాష్ పాటిల్, •పియంఆర్సి రమణయ్య, క్రాడాధికారి వీరు నాయక్, ఎస్ఓ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.