Take a fresh look at your lifestyle.

మే 10నుంచి 14రోజుల పాటు..

  • తమిళనాడు సంపూర్ణ లాక్‌డౌన్‌..
  • ‌కొరోనా కట్టడి కోసం తక్షణచర్యలపై  ప్రభుత్వం దృష్టి

కొరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడులో నూతనంగా ఎన్నికైన డిఎంకె అధినేత స్టాలిన్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 10నుండి మే24 వరకు అంటే 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది. రాష్ట్రంలో  కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనివార్యమైన పరిస్థితుల కారణంగా షట్‌డౌన్‌ ‌తప్పదని ప్రభుత్వం తెలిపింది. ఈ లాక్‌డౌన్‌ ‌సమయంలో కూరగాయలు, మాంసం, చేపల దుకాణాలు, నిత్యావసర సరుకుల దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచే అవకాశాన్ని ఇచ్చింది. మిగిలిన దుకాణాలు పూర్తి స్థాయిలో మూసివేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం షాపులు, బార్లు సైతం పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపింది.

రెస్టారెంట్లకు కేవలం భోజనం తీసుకువెళ్లే సదుపాయాలకు మాత్రమే అనుమతినిచ్చింది. నిత్యావసర సేవలతో పాటు పెట్రోల్‌ ‌బంకులు మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తాయని చెప్పింది. సంపూర్ణ లాక్‌డౌన్‌ ‌విధిస్తున్న నేపథ్యంలో ఈ శని, ఆదివారాల్లో అన్ని దుకాణాలను ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు తెరచి వుంచనున్నట్లు తెలిపింది.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్‌ ‌కర్ఫ్యూలు, వీకెండ్‌ ‌లాక్‌ ‌డౌన్‌ ‌లు, సంపూర్ణ లాక్‌ ‌డౌన్‌ ‌వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే తాజాగా తమిళనాడు సర్కార్‌ ‌కూడా రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌ ‌డౌన్‌ ‌విధించింది.

రాష్ట్రంలో 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌ ‌డౌన్‌ ‌విధిస్తున్నామని, ఈ నెల 10 ఉదయం ఆరు గంటల నుంచి 24 అర్ధరాత్రి వరకు లాక్‌ ‌డౌన్‌ అమల్లో ఉంటుందని తమిళనాడు సర్కార్‌ ‌పేర్కొంది.  కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌లో భాగంగా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తమిళనాడు సర్కార్‌ ‌వెల్లడించింది.

Leave a Reply