Take a fresh look at your lifestyle.

చేగుర్తి గ్రామంలో పూర్తిగా లాక్‌ ‌డౌన్ మరోమారు కొరోనా విజృంభణ..!

  • ప్రభుత్వం అప్రమత్తం
  • మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారులను హెచ్చరించిన మంత్రి
‌సరిహద్దు రాష్ట్రాల్లో కొరోనా కేసులు అనూహ్యంగా పెరగడంపై తెలంగాణ వైద్యారోగ్యశాఖను మంత్రి ఈటల రాజేందర్‌ అ‌ప్రమత్తం చేశారు. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో అందుబాటులోకి తేవాలని కోరారు. 50ఏండ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి త్వరగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని అన్నారు. ’కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో కొరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్త కేసులు పెరగకుండా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాం.
రాష్ట్రంలో కొవిడ్‌ ‌పరీక్షలు పెంచుతాం.  గాంధీ, టిమ్స్, ‌నిమ్స్‌లో మళ్లీ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతానికి కేసులు భారీగా పెరిగిన దాఖలాలు లేవు. ప్రస్తుతానికి కర్ఫ్యూపై ఎలాంటి ఆలోచన లేదు. కొరోనా ఉన్నంతకాలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని’ మంత్రి సూచించారు. ఇదిలావుంటే కరీంనగర్‌  ‌జిల్లాలో మరోసారి కొరోనా లక్షణాలు బయటపడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్‌ ‌నగర శివారు గ్రామాల్లో కొరోనా బయట పడడంతో ఆయా గ్రామాల్లో భయం నెలకొంది. దుర్శేడు, చేగుర్తిలో కొరోనా కేసులు పెరుగుతున్నాయి.
చేగుర్తిలో 35 కేసులు బయటపడ్డాయి. దీంతో గ్రామంలో పూర్తిగా లాక్‌ ‌డౌన్‌ ‌విధించారు. గ్రామస్తులందరికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. దుర్శేడులో కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల్లో భయం నెలకొంది.

Leave a Reply