Take a fresh look at your lifestyle.

పోటీ పరీక్షలు వాయిదా వేయాలి

విద్యార్థుల జీవితాలతో మోడీ, కేసీఆర్‌లు ఆటలు ఆడుతున్నారన్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

‌రాష్ట్రంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలని గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్‌ ‌రావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన దీక్షకు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ,ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ ‌కుమార్‌ ఇతర నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని, కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి సమయంలో పరీక్షలు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విద్యార్థుల కోసం
ఎన్‌ఎస్‌యూఐ నిరాహార దీక్ష చేస్తుందని జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌-‌జెఈఈ నీ దాయిదా వేయాలని కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌చేస్తుందన్నారు.
విద్యార్థుల జీవితాలతో దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ఆటలాడుతున్నారని విమర్శించారు. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతున్న టైంలో పరీక్షలు వాయిదా వేయాలని, జాతీయ స్థాయి నీట్‌-‌జెఈఈ, రాష్ట్ర స్థాయిలో ఎంట్రన్స్ ‌పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ ‌చేస్తూ గురువారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు పీసీసీ పిలుపునిచ్చారు. ఆయకర్‌ ‌భవన్‌ ‌వద్ద ఆందోళన చేపడతామని అన్నారు. దీంతోపాటు సోషల్‌ ‌మీడియాలో కూడా పోస్ట్ ‌చేస్తూ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ ‌చేయాలని అన్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ ‌ఛార్జ్ ఆర్‌సి కుంతియా సైతం వీడియోలో తన సందేశాన్ని పంపించారు. నీట్‌-‌జేఈఈ తో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోటీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply