Take a fresh look at your lifestyle.

వ్యవసాయ ఉత్పత్తుల్లో పోటీ పెరగాలి

రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చూడాలి
బోర్ల కింద వరి బదులు మిల్లెట్స్ ‌పంటలను ప్రోత్సహించాలి
ఫిషింగ్‌ ‌హార్బర్లు త్వరగా పూర్తి చేసేలా చూడాలి
ఇన్‌‌ఫ్రా ప్రాజెక్టస్ ‌ప్రగతిపై సిఎం  జగన్‌ ‌సమీ క్ష

అమరావతి,అక్టోబర్‌ 8 : ‌వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచేలా చూడాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. దీనివల్ల రైతులకు మంచి ధర వస్తుందని అన్నారు. ధరల విషయంలో రైతులకు ఎక్కడ నిరాశాజనక పరిస్థితులు ఉన్నా వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాలన్నారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా చూడాలన్నదే తన లక్ష్యమని  సీఎం జగన్‌ అన్నారు. అలాగే ఆర్బీకేల పనితీరును దేశవ్యాప్తంగా కొనియాడుతున్నారని, నాణ్యత ఉన్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు మంచి ధరలకే లభిస్తున్నాయన్నారు. బయట మార్కెట్లో డీలర్‌ అమ్మే రేట్లకన్నా తక్కువ రేట్లకే లభిస్తున్నాయన్నారు. అగ్రి ఇన్‌‌ఫ్రా ప్రాజెక్టస్ ‌ప్రగతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సక్ష నిర్వహించారు. రైతులకు మంచి ధర అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.రేట్లలో మోసం లేదు, క్వాలిటీలో మోసం లేదని అన్నారు. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్బీకేల్లో రైతులు ఆర్డర్లను ప్లేస్‌చేయగానే వాటిని వారికి అందించేలా చర్యలు తీసుకోవా లన్న సీఎం,అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీంట్లో భాగంగా పొటాష్‌ను కూడా తెప్పించుకున్నాం.ఇలాంటి ఆర్బీకేలపై కావాలనే కొందరు దుష్పచ్రారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన సీడ్‌, ‌ఫీడ్‌, ఎరువులు రైతులకు అందుబాటులోకి రావడం వారికి ఇష్టం లేనట్టుందన్నారు. అధిక ధరల్లో రైతులు చిక్కుకోవాలని, ఎరువులకోసం, విత్తనాల కోసం అప్పులు చేసి వడ్డీలు ద వడ్డీలు చెల్లించే పరిస్థితులే కొనసాగాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్టవేస్తూ ఆర్బీకేలను తీసుకురావడం, వాటి ద్వారా రైతుల ముంగిటకే సేవలు అందించడం వారికి నచ్చడం లేదేమో అన్నారు. మరో అడుగు ముందుకేసి ఆర్బీకేలను సబ్‌డీలర్లుగా మార్పు చేస్తున్నామని అధికారులు తెలిపారు. వచ్చే రబీ సీజన్‌నుంచి ఇది అమల్లోకి వస్తోందన్నారు.  దీంతో రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు.

వరి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హైరింగ్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేయాలన్న సీఎం బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చూడాలన్నారు. మిల్లెట్స్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగును ప్రోత్సహించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలన్నారు. ఇలాంటి చోట  ప్రాససింగ్‌ ‌ప్లాంట్లు కూడా పెట్టాలని, తద్వారా రైతులకు అండగా నిలబడగలుగుతామన్నారు. 33 చోట్ల సీడ్‌ ‌కమ్‌ ‌మిల్లెట్‌ ‌ప్రాససింగ్‌ ‌యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ డిసెంబరు నాటికి 20 యూనిట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 33 యూనిట్లను మార్చి 2022 కల్లా పూర్తి చేయడానికి లక్ష్యంగా నిర్దేశిరచుకున్నామని వెల్లడించారు. వచ్చే ఖరీప్‌నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపైనా సీఎం సక్ష చేశారు. ప్రాధాన్యతా క్రమంలో గుర్తించిన బీఎంసీలను డిసెంబర్‌ ‌నాటికి పూర్తిచేస్తామని అన్నారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమం చేపట్టిన జిల్లాల్లో పాల సేకరణ అంతకంతకూ పెరుగుతోందన్నారు. రైతులకు మేలు చేస్తున్న ఈ కార్యక్రమంపైనా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని సిఎం అన్నారు.

అమూల్‌ అన్నది ప్రైవేటు సంస్థకాదని, అది పెద్ద సహకార ఉద్యమం అని, పాలుపోసే రైతులే ఈ సంస్థకు యజమానులని సిఎం చెప్పారు. లాభాలన్నీ తిరిగి రైతులకే  వస్తాయని, ఇలాంటి కార్యక్రమంపైనా విషప్రచారానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారని జగన్‌ ‌మండిపడ్డారు. అమూల్‌ ‌వచ్చాక  పాల సేకరణధరలు పెంచాల్సిన పరిస్థితులు వచ్చాయని, దీనివల్ల రైతులకు మేలు జరుగుతోందని అన్నారు. పుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్ల ఏర్పాట్లపై వివరాలడిగిన సీఎం, ఇప్పటివరకు జరిగిన ప్రగతిని నివేదించగా, పుడ్‌ ‌ప్రాససింగ్‌ ‌యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు. ఫిషింగ్‌ ‌హార్బర్ల నిర్మాణంపైనా సీఎం సక్ష సందర్భంగా జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో పనులు జరగుతున్నాయని అధికారులు తెలిపారు. జులైలో పనులు దాదాపుగా పూర్తవుతాయన్నారు. మిగిలిన ఐదు ఫిషింగ్‌ ‌హార్బర్ల పనులపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ సక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ ‌సీఎస్‌ ‌పూనం మాల కొండయ్య, వ్యవసాయ మార్కెటింగ్‌ ‌ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి, పుడ్‌ ‌ప్రాససింగ్‌, ‌పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ముకేష్‌ ‌కుమార్‌ ‌నా, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్‌ ‌గుల్జార్‌, ఏపీడీడీసీఎఫ్‌ ‌లిమిటెడ్‌ ఎం‌డీ ఎ బాబు, వ్యవసాయశాఖ కమిషనర్‌ ‌హెచ్‌ అరుణ్‌కుమార్‌, అ‌గ్రికల్చర్‌ ‌మార్కెటింగ్‌ ‌కమిషనర్‌ ‌పి ఎస్‌ ‌ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్‌ ‌కె కన్నబాబు, ఉద్యానవనశాఖ కమిషనర్‌ ‌డాక్టర్‌ ఎస్‌ ఎస్‌ శ్రీ‌ధర్‌, ‌సీడ్స్ ‌కార్పొరేషన్‌ ‌వీసీ అండ్‌ ఎం‌డీ  జి శేఖర్‌ ‌బాబు, మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సమిక్ష అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ వ్యవసాయ మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సక్షించారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల బలోపేతంపై సీఎం పలు ఆదేశాలిచ్చారన్నారు. ప్రభుత్వ పనితీరుపై పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. దళారీలను అరికట్టడానికే భరోసా కేంద్రాలు తీసుకొచ్చామన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం ప్రథమ లక్ష్యమని తెలిపారు. ఎక్కడా ఎరువుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి రైతు భరోసా కేంద్రం.. సబ్‌ ‌డీలర్‌గా ఉంటుందన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు.

Leave a Reply