Take a fresh look at your lifestyle.

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

వనపర్తి,సెప్టెంబర్‌,09 (‌ప్రజాతంత్ర విలేకరి) : ఉమ్మడి మహబుబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురసిన అకాల వర్షానికి వరి,పత్తి కందులు ఆముదం, మొక్కజొన్న, మిరప, ఉల్లి ,పెసర వివిధ కూరగాయలు ఆకుకూరలు పంటలు దెబ్బతిన్నాయని కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌ ‌రెడ్డి తెలిపారు. బుధవారం రోజు వ్యవసాయ రాష్ట్ర కమీషనర్‌ ‌కార్యాలయం ముందు కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించినట్లు ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నష్టపోయిన రైతులకు వెంటనే పరహారం చెల్లించాలని పంటచేలు పాడైపోయి తీవ్రంగా నష్టం జరిగి రైతుల బతుకలను ఆగం చేశాయని ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 40వేల ఎకరాల పంట నీట మునిగి దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అనంతరం కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి ఎల్లపల్లి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు గొల్ల బాబన్న సందా వెంకటేష్‌, ఇ‌మ్రాన్‌ఖాన్‌, ‌తదితరుల పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!