Take a fresh look at your lifestyle.

టిటిడిలో 118 మందికి కారుణ్య నియామకాలు

నియామక పత్రాలు అందచేసిన ఇవో
తిరుపతి,జూలై 3 : తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చెందిన118 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. వారిని వివిధ విభాగాల్లో ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నట్లు ఇవో ప్రకటించారు. ఈసందర్భంగా టిటిడి ఈవో డా.కె ఎస్‌.‌జవహర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీవారి చెంత ఉద్యోగం చేయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు.తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్‌ ‌రెడ్డితో కలిసి ఈఓ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. వివిధ పరిపాలనా పరమైన కారణాల వలన పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామ కాలకు ప్రభుత్వ అనుమతితో ఉత్తర్వులు ఇస్తున్నట్టు తెలిపారు. వీరిలో 81 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, ఒక అసిస్టెంట్‌, 20 ‌మంది ఆఫీస్‌ ‌సబార్డినెంట్స్, ఒక డ్రైవర్‌, ఏడుగురు ఎమ్‌పిడబ్లూ, నలుగురు హెల్పర్లు, ముగ్గురు క్లీనర్లు, ఒక ఫారెస్టు మజ్దూర్‌ ఉన్నట్టు డా.కె ఎస్‌.‌జవహర్‌ ‌రెడ్డి తెలిపారు.

ఇదిలావుంటే తిరుమలలో భక్తులుకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్లు నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అదనపు ఇఓ ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన వారు నిరూపిస్తే… భాధ్యత వహిస్తాం. నిరూపించలేకపోతే…. వారు భాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించడం వలన గతంలో కంటే నిర్వహణ వ్యయం 50 లక్షలు తగ్గించాం అని తెలిపారు. ప్రస్తూతం కౌంటర్లు నిర్వహణ చేసే వారు 40 వేలు చెల్లించి స్పాన్సర్‌ ‌షిప్‌ ‌పోందవచ్చు. 40 కౌంటర్లు నిర్వహించేందుకు 12 బ్యాంకులు ముందుకు వచ్చాయి. త్వరలోనే అన్ని కౌంటర్లుకు స్పాన్సర్‌ ‌షిప్‌ ‌వస్తూందని భావిస్తూన్నా అని పేర్కొన్నారు.

Leave a Reply