Take a fresh look at your lifestyle.

‘‘స్త్రీ అభివృద్ధితో సమాజాభివృద్ధి ’’

“మాతృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండే కాలంలో ప్రతి విషయంలో మాతృమూర్తి దే పై చేయి. కాలక్రమేణ శ్రమ విభజన జరగి, ఆహార సేకరణ వంటి పరిస్థితుల్లో స్త్రీలు బాధ్యతలుపైబడి, తల్లిగా బాధ్యతలు నిర్వహించవలసిన పరిస్థితుల్లో, ఇంటికే పరిమితమై పురుషుల మీద ఆధార పడిన ఫలితంగా పితృస్వామ్య వ్యవస్థకు దారితీసి. ఇరువురి మధ్య అసమానతలు పెరుగుతూ పురుషాధిక్యత బలపడింది. పురుషాహంకారం పెరిగిపోయి స్త్రీ పట్ల చులకన భావం ఏర్పడింది.”

మాతృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండే కాలంలో ప్రతి విషయంలో మాతృమూర్తి దే పై చేయి. కాలక్రమేణ శ్రమ విభజన జరగి, ఆహార సేకరణ వంటి పరిస్థితుల్లో స్త్రీలు బాధ్యతలుపైబడి, తల్లిగా బాధ్యతలు నిర్వహించవలసిన పరిస్థితుల్లో, ఇంటికే పరిమితమై పురుషుల మీద ఆధార పడిన ఫలితంగా పితృస్వామ్య వ్యవస్థకు దారితీసి. ఇరువురి మధ్య అసమానతలు పెరుగుతూ పురుషాధిక్యత బలపడింది. పురుషాహంకారం పెరిగిపోయి స్త్రీ పట్ల చులకన భావం ఏర్పడింది. బెట్రాండ్‌ ‌రస్సెల్‌ ‘‘ ‌మ్యారేజ్‌ అం‌డ్‌ ‌మోరల్స్’’ ‌రాసిన పుస్తకంలో మొదట ప్రతి సమాజంలోనూ మాతృస్వామ్యం ఉండేదని మగవాడు తనను తాను వ్యక్తపరచడం మొదలుపెట్టి తన జీవితం సమాధి దగ్గరే ఆగిపోకూడదు అనే భావన మొదలవగానే పితృస్వామ్యం అమలులోకి వచ్చింది అంటారు….

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అపూర్వమైన, అద్భుతమైన స్త్రీ ఆరాధన మన దేశంలో ఉంది..No man is competely a man,,,No woman is completely a woman.There is woman in a man.There is man in a woman అని ఆడ్లర్‌ అనే మనస్తత్వ శాస్త్రవేత్త అన్నట్లు she లో he ఉన్నాడు.woman లో man ఉన్నాడు…. ఇద్దరూ సమాన భాగస్వాములు, సుఖ దుఃఖాలను సమానంగా పంచుకునే స్నేహితులు. స్త్రీ పురుష అభేద తత్వం భారతీయ సంస్కృతిలో చిగురించి మొగ్గలు తొడిగింది. నాగరికత అభివృద్ధి పరిణామ క్రమంలో ఆధిపత్యం చెలాయించే పరిస్థితులు పెరిగి, స్వార్థపూరిత ఆలోచన వల్ల ఆడపిల్ల తల్లిదండ్రులకు బరువు అయింది. గుండెల మీద కుంపటి అయింది. దానాలలో కన్యాదానం ఒకటి అని భావించి తండ్రి కూతురును గోవులతో ఇతర వస్తువులతో పెళ్ళి చేసి పంపేవారు. పరిస్థితులు తారుమారై వరకట్నం డిమాండ్‌ ‌చేస్తూ రూపాయలు దండుకునే పరిస్థితులొచ్చాయి.. కాలానుగుణంగా ధర్మాలు సాంప్రదాయాలు ఆచారాలు మారి, వస్తు వినిమయ సంస్కృతి పెరిగిపోయింది. అమ్మాయి పుడితే పెద్ద కట్నం ఇవ్వాలని సంపద దార పోయాలని భావించి కొందరైతో భ్రూణహత్యలకు పాల్పడడం మానవాళి మనుగడకు దుష్పరిణామం. సమాజంలోని ప్రతి రంగంలో పురుషులకు తీసిపోని విధంగా స్త్రీలు నైపుణ్యత సాధించినప్పటికీ, సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించడం లేదు.

పారిశ్రామిక విప్లవం తర్వాత పరిశ్రమలలో రోజుకు 14 గంటల నుండి 18 గంటలు చాకిరీతో స్త్రీల శ్రమ దోపిడీ నిరాటంకంగా కొనసాగుతుండేది. ఈ అణిచివేతను, వివక్ష ను నిరసిస్తూ మహిళా కార్మికులు మౌలిక వసతుల కల్పన కోసం’’ మాకు రొట్టె కావాలి- రోజా పూలు కూడా కావాలి’’ అని నినదిస్తూ మహత్తర పోరాటాలు చేశారు. 1908లో పనిగంటల కుదింపు, మెరుగైన జీతం, ఓటు హక్కు కోసం న్యూయార్క్ ‌లో 15 వేల మంది మహిళలు చేసిన డిమాండ్ల దృష్ట్యా అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909లో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. క్లారా జెట్కిన్‌ 1910 ‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ఆఫ్‌ ‌వర్కింగ్‌ ఉమెన్స్ ‌సదస్సులో ప్రతిపాదించిన మేరకు 17 దేశాల నుంచి హాజరైన మహిళలు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం తొలిసారి 1911లో ఆస్ట్రియా , డెన్మార్క్, ‌జర్మనీ స్విట్జర్లాండ్‌ ‌దేశాలలో నిర్వహించారు.

2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు జరిగాయి. ఐక్యరాజ్యసమితి అధికారికంగా 1975 నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఆ స్ఫూర్తితో మహిళల హక్కుల సాధన కోసం, భూమి కోసం , భుక్తి విముక్తి కోసం రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి పూలే, ఆదివాసి వీరవనితలు సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ లాంటి మహిళలు ముందు నిలబడి పోరాటం చేశారు. అయితే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉద్దేశ్యం నెరవేరలేదు. మహిళలకు హక్కులు, సాధికారిత , అణిచివేత లేని సమాజం కోసం, శ్రామిక మహిళల అభ్యున్నతి కోసం, లైంగిక దాడులు అత్యాచారాలు అవమానాలు లేని రోజు కోసం ఎదురుచూస్తున్న ఎండమావిగా మిగిలిపోయింది. అభివృద్ధి పేరిట జీవితాలు ధ్వంసం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు స్త్రీలను చైతన్యపరచ వలసిన అవసరం ఎంతైనా ఉంది.

అనేక సంవత్సరాలుగా స్త్రీల స్థితిగతుల్లో మార్పు ఇంకా రాలేదు. స్త్రీలు ప్రతి విషయంలో వివక్షకు, గురవుతూ, అత్యాచారాలకు బలవుతూనే ఉన్నారు. పూర్తిస్థాయిలో విద్య అందని ద్రాక్షగానే మిగిలింది. అత్యాచార వార్త లేని రోజు లేదు. భారత రాజ్యాంగం ప్రకారం మహిళల స్థితిగతులు మెరుగుపరచడానికి అనేక సూచనలు చట్టాలు ఉన్నాయి. వాటిని ప్రతి మహిళా తెలుసుకోవాలి. హిందూ వారసత్వ చట్టం 1995 ప్రకారం వారసత్వ ఆస్తి లో స్త్రీలకు సమాన వాటాలు ఇవ్వాలి. పిండదశలోనే లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమన్న విషయం తెలుసుకోవాలి. అలాగే గృహ హింస నరోధక చట్టం ప్రసూతి సెలవులు హక్కు చట్టం 1961, సమాచారహక్కు చట్టం న్యాయ సహాయ హక్కు.. చట్టాలను అధ్యనం చెయ్యాలి. మహిళల భద్రత, గౌరవాన్ని రక్షించేందుకు ఉన్న చట్టాలను సమర్థవంతంగా చిత్తశుద్ధితో అమలు చేయాలి. పాలక పీఠాలను కదిలించగల ఓటు బ్యాంకుగా స్త్రీల స్వయం శక్తి ని గుర్తిస్తే బాగుంటుంది. అందుకే గురజాడ అన్నట్లు స్త్రీ మేల్కోవాలి, ఎదిరించాలి, తిరిగబడాలి.. ఆడది అబల కాదు పని నిరూపించాల్సిన అవసరం ఉంది. తల్లిగా ,చెల్లిగా, కూతురిగా పలు బాధ్యతలు భుజాన వేసుకొని సమాజానికి దిశా నిర్దేశం చేయగల స్త్రీ అభివృద్ధి మెరుగు పడితేనే సమాజ అభివృద్ధి సాధ్యం. లేనిచో మానవాళి శ్రేయస్సుకు దుష్పరిణామం.

tanda sadhananda
తండా సదానందం, మహబూబాబాద్‌ ‌జిల్లా.

Leave a Reply