Take a fresh look at your lifestyle.

భారత కమ్యూనిస్టు లెజెండ్‌ ‘‌పుచ్చలపల్లి’

ఖమ్మం, ఏప్రిల్‌ 19 ‌ప్రజాతంత్ర (ప్రతినిధి): వర్గ రహిత సమాజం సాధించటానికి త్యాగాలకు, సుదీర్ఘ పోరాటాల కు కార్యకర్తలంతా సిద్దం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.సాయిబాబు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావులు అన్నారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో ఆర్‌.‌ప్రకాష్‌ అధ్యక్షతన జరిగిన కామ్రేడ్‌ ‌పుచ్చలపల్లి సుందరయ్య 35 వర్థంతి సభలో వారు మాట్లాడుతూ వర్గరహిత సమాజం సాధించటం అంత సులభమైన పని కాదని, అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పార్టీ విధానం పట్ల వినయ విధేయతలు, నిరాడంబర జీవితం, ఎల్లప్పుడూ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం వలన ఆయన అత్యుత్తమ కమ్యూనిస్టు నాయకుడయ్యాడని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం చివరి వరకూ జీవించి ప్రజా పోరాటాలకు ప్రాధాన్యతనివ్వడంతోపాటు, సామాజిక పోరాటాలకు, సేవా కార్యక్రమాలకు కూడ అంతే ప్రాధాన్యతను సుందర య్య ఇచ్చాడని అన్నారు.

శ్రమను గౌరవించే సమాజం ఏర్పాటుకు అవిరళ కృషి చేస్తారని, స్త్రీలను కించపర్చడం, కులాధిక్యత భావాలను ఉపయోగించుకొని దళితులను, బలహీనవర్గాలను పీడించే చర్యలకు వ్యతిరేకంగా పోరా టాలు చేశారన్నారు. ప్రజా ఉద్యమాలను పటిష్టపర్చేం దుకు అభ్యుదయ శక్తులను, సామాజిక శక్తులను కలుపు కొని విశాల ఉద్యమాన్ని నిర్మించాలన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడైనప్పటికీ అన్ని వర్గాల ప్రజలు అభిమా నించే ప్రజానేత సుందరయ్య అని కొనియాడారు. తొలుత సుందరయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా విప్లవజోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యురాలు బత్తుల హైమావతి, ఎం.సుబ్బా రావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వ రరావు, జిల్లా కమిటి సభ్యులు బండారు రమేష్‌, ‌పి.ఝాన్సీ, తుమ్మ విష్ణువర్ధన్‌, ‌నాయకులు కె.దేవేంద్ర, మేకల నాగేశ్వరరావు, మచ్చా రంగయ్య, వై.శ్రీనివాస రావు, వంజాకుల లక్ష్మీనారాయణ, వి.సదానంద్‌, ‌రామారావు, ఎం.గోపాల్‌, ‌మెరుగు రమణ పాల్గొన్నారు.

గరిడేపల్లిలో…

Communist Legend of India

గరిడేపల్లి, మే 19(ప్రజాతంత్ర విలేకరి) : దక్షిణ భారత కమ్యూనిస్టు •ద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతిని మంగళవారం స్థానిక ఎంఎస్‌ ‌భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి షేక్‌ ‌యాకుబ్‌ ‌మాట్లాడుతూ కృష్ణా జిల్లా అలగానిపాడులో భూస్వామ్య రెడ్డి కుటుంబంలో జన్మిం చి అప్పట్లోనే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి తన ఆస్తిని పేదవారికి పంచి ప్రజలే తన జీవితమని తుది వరకూ పోరాడి పార్లమెంట్‌కు కూడా సైకిల్‌పై వెళ్లి తన నిజాయితీని చాటుకున్న మహానేత అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ ‌రామస్వామి, మచ్చ వెంకటేశ్వర్లు, తుమ్మల సైదయ్య, జుట్టుకొండ వెంక టేశ్వర్లు, దోసపాటి భిక్షం, వెంకటరమణ, నాగేంద్ర, బొల్లేపల్లి శ్రీనివాస్‌, ‌బొమ్మకంటి వెంకయ్య పాల్గొన్నారు.

రామన్నపేట, మే19 (ప్రజాతంత్ర విలేకరి) సుందరయ్య జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సిపి ఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహం గీర్‌ అన్నారు. ప్రజా నాయకుడు, ఆదర్మ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్థంతి సందర్బంగా మంగళవారం మునిపంపుల సిపియం గ్రామ శాఖ ఆద్వర్యంలో 44 పేద ముస్లిం కుటుంబా లకు 5రకాల నిత్యావసర సరుకులు పంపిణి చేసి మాట్లాడారు. జీవితాన్ని పేదలకు అంకితమిచ్చి నిస్వార్థ నాయకుడు సుందరయ్య అన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టి తన ఆస్తులను కూడా పేదలకు పంచి ఉత్తమ కమ్యూనిస్టు విలువలతో జీవించి ఇప్పటికి సజీవమై పోరాటాల్లో ఉద్యమిస్తున్నాడన్నారు. పేదల ఆకలి తీర్చటమే సుందరయ్యకు మనం ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. కక్కిరేణి, వెల్లంకి తదితర గ్రామాలలో సుందరయ్య వర్దంతి సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మీర్‌ ‌ఖాజా అలీ, సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం, గ్రామ సర్పంచ్‌ ‌యాదాసు కవితయాదయ్య, వనం ఉపేందర్‌, ‌వేముల సైదులు, తాళ్ళపల్లి జితేందర్‌, ‌జంపాల అండాలు, యండి మైనోద్దిన్‌, ‌జోగుల శ్రీనివాస్‌ ‌పాల్గొన్నారు.

భూదాన్‌ ‌పోచంపల్లిలో…:

సీనియర్‌ ‌నాయకులు కౌడే బాలనరసింహ అన్నారు. మంగళవారం భూదాన్‌ ‌పోచంపల్లి పురపాలక కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సుందరయ్య 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుందరయ్య తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడని, పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌పట్టణ కార్యదర్శి గడ్డం వెంకటేశం, ఎస్‌ఎఫ్‌ ఐ ‌మండల కార్యదర్శి మంచాల మధు, కమలమ్మ, పగడాల శివ, జగన్‌, ‌రాజు,సాయి, రాములు, బాల్‌ ‌రెడ్డి, నవీన్‌, ‌సాయికిరణ్‌, ‌నరసింహ పాల్గొన్నారు.

తుర్కపల్లిలో….
మండలంలోని సీపీఎం కార్యాలయం ముందు పుచ్చల పల్లి సుందరయ్య 35వ వర్ధంతి సందర్భంగా ఆటో కార్మికులకు స్థానిక ఎస్‌ ఐ ‌యాదగిరి చేతుల మీదుగా సిఐటియు ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి సిఐటీయు జిల్లా కార్య దర్శి హాజరై మాట్లాడారు. సుందరయ్య సేవలు కార్మికులు మర్చిపోరన్నారు. లాక్‌ ‌డౌన్‌తో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, కుటుంబాలకు 7500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు. కార్మికులకు అండగా ఉండవాల్సిన ప్రభు త్వలు కార్పొరేటర్లకు అండగా నిలిచి 69వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిందన్నారు. కార్మికుల చట్టాలను సవరణ చేస్తూ 8గంటల నుంచి12 గంటల పనిదినమగా పెంచేందుకు ఆలోచనలో ఉం దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి పోతరాజు జహింగిర్‌, ఎస్‌ఎఫ్‌ఐ ‌జిల్లా అధ్యక్షుడు వనం రాజు, నాయకులు కొకొండ లింగయ్య, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Leave a Reply