Take a fresh look at your lifestyle.

అ‌క్రమాలు చేస్తూ .. ఆదర్శాలు వల్లించడమా?

BJP State presidents Laxman fire on KCR

కెసిఆర్‌, ‌కెటిఆర్‌లు నోరు అదుపులో పెట్టుకోవాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌: అ‌క్రమాలు చేస్తూ.. ఆదర్శాలు వల్లించడం తండ్రి, కొడుకులకే చెల్లిందని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్‌, ‌కేటీఆర్‌లకు మించిన అవకాశవాదులు రాజకీయాల్లో ఎవరు లేరన్నారు. కారు కూతల కేటీఆర్‌.. ‌నోటిని అదుపులో పెట్టుకోవాలని లక్ష్మణ్‌ ఒకింత హెచ్చరించారు. ఇద్దరూ అసంతృప్తి, అనుమానం, అభద్రత, ఆక్రోశానికి నిలువుటద్దం అంటూ మండిపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఏకైక పార్టీ బీజేపీ. వార్డుల రూపకల్పన, రిజర్వేషన్లలో టీఆర్‌ఎస్‌ అనేక అక్రమాలకుపాల్పడింది. అధికార దుర్వినియోగం చేసి గెలవటం కూడా .. ఓ గెలుపేనా?’ అని లక్ష్మణ్‌ ‌నిప్పులు చెరిగారు. బీజేపీ అంటే టీఆర్‌ఎస్‌కు భయం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ‌భాష గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.

 

నిజామాబాద్‌లో మూడో స్థానంలో ఉన్న టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగంలో మేయర్‌ ‌పీఠాన్ని దక్కించుకుందని, తుక్కుగూడలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంపీతో ఎలా ఓటు వేయిస్తారని, తుక్కుగూడ ఛైర్మన్‌ ఎన్నికను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.. మంత్రి సబితారెడ్డి చర్యలతో ఇంద్రారెడ్డి ఆత్మ ఘోషిస్తోందని అన్నారు. దేశంలోని మా ఎంపీలందరితో వోటు వేయిస్తే.. టీఆర్‌ఎస్‌కు ఒక్క మున్సిపాలిటీ దక్కదు. నిజామాబాద్‌ ‌ప్రజలు పార్లమెంట్‌, ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను తిరస్కరించారు. బైంసాలో ఒక్క వార్డు కూడా గెలవని టీఆర్‌ఎస్‌.. ‌బీజేపీని విమర్శించడమా?’ అని లక్ష్మణ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని, కేసీఆర్‌ను మించిన నియంత దేశంలోనే ఎవ్వరూ లేరని, కేసీఆర్‌ అవినీతి పాలనపై ఉద్యమించి ప్రజలకు చేరువవుతామని, తాము ఫిర్యాదులు చేస్తే మంత్రులు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. అధికారులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని, 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురుతుందని, జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని లక్ష్మణ్‌ అన్నారు.

Tags: Tukkuguda elected chairman,KCR and KTR, Laxman BJP state president,nizamabad

Leave a Reply