Take a fresh look at your lifestyle.

ఆజాదీ కా అమృత్‌ ‌మహాత్సవ్‌ ‌కార్యక్రమాలపై కమిటీ భేటీ

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్: ‌స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో  ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఉత్సవ నిర్వహణ కమిటీ బుధవారం రవీంద్రభారతిలో సమావేశమైంది. ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్‌, ‌ప్రభుత్వ సలహాదారు డా.కెవి రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష జరిగింది.

ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ ప్రణాళికను క్షుణ్నంగా అధ్యయనం చేసిన కమిటీ ఈనెల 12 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాలలో భాగంగా దేశభక్తిని పెంపొందించే విధంగా వివిధ స్థాయిల్లో ఫ్రీడం రన్‌, ‌కవి సమ్మేళనాలు, వ్యాస రచన ఉపన్యాసం, చిత్రలేఖన పోటీలతో పాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై చర్చించింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలతో ఒక నివేదికను తయారు చేసి ఒక నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నట్లు ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ‌కెవి రమణాచారి తెలిపారు.

Leave a Reply