Take a fresh look at your lifestyle.

రేపు రైతు వేదికలకు శ్రీకారం కొడకండ్లలో ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో రేపు మధ్యాహ్నం 12.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతు వేదికను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. రైతు వేదిక ఏర్పాటు ఉద్దేశం, ఆవశ్యకత,వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను సీఎం వివరిస్తారు. అంనతరం రైతు వేదిక సపంలోని పల్లె ప్రకృతి వనాన్ని కూడా సీఎం సందర్శించనున్నారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాకు చెందిన రైతుబంధు పథకం జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటలపై చర్చించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను నిర్మిస్తోంది. ఆన్‌లైన్‌లో సీఎం కేసీఆర్‌ ‌నేరుగా రైతులతో మాట్లాడేలా.. రాష్ట్రవ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 వేదికలను నిర్మిస్తున్నారు.

సమావేశాలు, చర్చలు నిర్వహించడంతోపాటు గోడౌన్‌గా ఈ వేదికలను ఉపయోగించనున్నారు. ప్రతి ఐదువేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి.. 2,604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నిధులను కూడా కేటాయించింది. పలు చోట్ల వేదిక నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. మరికొన్ని చోట్ల శరవేగంగా పనులు సాగుతున్నాయి. దసరా నాటికే వీటిని పూర్తి చేయాలని భావించారు. అయితే వరదల కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి, ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌, ‌రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply