Take a fresh look at your lifestyle.

విదేశాల నుంచి హైదరాబాద్‌కు వొచ్చే విమానాలు రద్దు చేయండి

  • ఇతర దేశాల నుంచి 20వేల మంది వచ్చే అవకాశం
  • ఆరుగురు కొరోనా బాధితులకు చికిత్స
  •  ప్రజలు సహకరించాలి:  మంత్రి ఈటల

కొరోనా వ్యాధి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నందున, విదేశాల నుంచి హైదరాబాదర్‌కు వచ్చే విమానాలన్నింటినీరద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ‌విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి 20వేల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని, వారందరికీ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌ ‌సెంటర్లుకు పంపిస్తామని, రాష్ట్ర మంత్రి పేర్కొన్నారు. కొరోనాను నిరోధించేందుకు కావాల్సిన జాగ్రత్తలన్నింటినీ తీసుకుంటున్నామని, ప్రతీ దశలో ప్రభత్వం అత్యంత అప్రమత్తంగా ఉన్నదని మంత్రి తెలిపారు. బుధవారం ఈటెల మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. తెలంగాణలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, విదేశాల నుంచి వచ్చే వారికే పాజిటివ్‌ ఉం‌టుందని ఆయన పునరుద్ఘాటించారు.కొరోనా వ్యాప్తి నివారణకు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులను నిలువరిస్తే వ్యాధిని నియంత్రించేందుకు అవకాశాలు మెరుగుపడుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఒకవైపున కొరోనా వణికిస్తుంటే హైదరాబాద్‌కు విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నదని ఆయన పుర్కొన్నారు.

తెలంగాణలో ఆరుగురు కొరోనా బాధితులు గాంధీ దవాఖానాలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.స్కాట్లాండ్‌నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌ ‌వచ్చిందని వేగంగా చికిత్స జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఐపీఎం, నిమ్స్, ‌ఫీవర్‌, ఉస్మానియా లలో కొరొనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. అయితే విదేశాల నుంచి ఎంతమంది వచ్చిన ప్రత్యేకంగా పరీక్షలు చేసేందుకు క్వారంటైన్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలలో కూడా క్వారంటైన్‌ ‌సెంటర్లు పనిచేస్తున్నాయని, వాటిని జిల్లాకలెక్టర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు.కొరోనా రాకముందు హైదరాబాద్‌కు వచ్చిన వారిని కూడా గుర్తించి అసవరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.కొరోనా లక్షణాలున్న వారిని గుర్తించి 40 ప్రత్యేక బస్సులలో క్వారంటైన్‌ ‌సెంటర్లకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. సెలవులు ఇచ్చింది పర్యటను చేసేందుకు కాదు పాఠశాలల నుంచి కాలేజీలకు విశ్వవిద్యాలయాలకు సెలవులు ఇచ్చింది పర్యటనలు చేసేందుకు కాదని ఈటెల అన్నారు. ఇంటివద్ద ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికే సెలవులు ఇచ్చామని తెలిపారు. ఎక్కువ మంది గుమ్మికూడవద్దని చెప్తున్నప్పటికీ పర్యటనలు చేయడం సబబుకాదని చెప్పారు.

కొరోనాను ప్రభుత్వమే నియంత్రించాలా?
కొరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదని, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలను పాటించ•లని కోరారు. •ప్రతీ వ్యక్తి వ్యక్తిగత శుభ్రతతో పాటు సామాజిక శుభ్రతపట్ల జాగ్రత్త వహించాలని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!