Take a fresh look at your lifestyle.

జ్యోతులు వెలిగిద్దాం రండి వాజ్‌పేయ్‌ ‌కవితను జోడిస్తూ ప్రధాని మోడీ ట్వీట్‌

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఆదివారం ప్రజలందరూ తమతమ ఇళ్లల్లోని విద్యుత్‌ ‌లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చిన విషయం విదితమే. అయితే దీనికి సంబంధించిన మాజీ ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజపేయి కవితా గానాన్ని ప్రధాని మోదీ శనివారం ట్విట్టర్‌లో పోస్ట్ ‌చేశారు… ఆ కవిత ఇదే…
రండి.. తిరిగి దీపాలను వెలిగిద్దాం…పట్టపగలే చిమ్మ చీకటి
నీడ చేతిలో ఓడిన సూరీడు ..అంతరాళల్లోని ప్రేమను పిండుకుందాం…
ఆరిన వత్తిని వెలిగిద్దాం…రండి… తిరిగి దీపాలను వెలిగిద్దాం.. అంటూ కవిత సాగుతుంది.  మాజీ ప్రధాని
వాజపేయి కవితా పంక్తులను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.  5వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో  9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్‌ ‌లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించి, తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించాలి. చమురు దీపాలు లేదా కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు లేదా సెల్‌ఫోన్‌ ‌ప్లాష్‌లైట్లు… ఏవి వీలైతే అవి వెలిగించి, కరోనా అనే చీకటిని, ఆ మహమ్మారిని తరిమేద్దాం అనే సంకల్పం తీసుకోవాలి. నా కోసం  విలువైన సమయంలో ఓ 9 నిమిషాలు కేటాయించండి. జనతా స్ఫూర్తిని మరోమారు చాటండి’ అని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy