Take a fresh look at your lifestyle.

కల్నల్‌ ‌సంతోష్‌బాబుకు సీఎం కేసీఆర్‌.. ‌ఘన నివాళి

భార్యకు రూ.4కోట్ల చెక్కు, గ్రూప్‌1 ఉద్యోగ నియామకపత్రం, ఇంటి స్థలం పత్రాలు, తల్లిదండ్రులకు రూ.1కోటి చెక్కు అందజేత కుటుంబానికి అండగాఉంటానని భరోసా

భారత్‌ ‌చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్‌ ‌బిక్కుమళ్ళ సంతోష్‌బాబు కుటుంబాన్ని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సూర్యాపేటలో పరామర్శించారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్‌ ‌సంతోష్‌బాబు నివాసానికి చేరుకొని ముందుగా కల్నల్‌ ‌సంతోష్‌బాబు చిత్రపటానికి పూలు చల్లి ఘన నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ,వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌తో కలిసి సంతోష్‌బాబు భార్య సంతోషి, తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్‌, ‌సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్‌ ‌పిల్లలు అబిజ్ఞ, అనిరుధ్‌ ‌తేజలను దగ్గరికి తీసుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్‌బాబు త్యాగం వెలకట్టలేనిదని ఆయన అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు సంతోష్‌ అని కొనియాడారు. సంతోష్‌ ‌మరణం తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదనకు లోనయ్యారు. ప్రభుత్వం సంతోష్‌బాబు కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటుందని తెలిపారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తమను సంప్రదించాలని కోరారు. సంతోష్‌బాబు కుటుంబ బాగోగులు చూసుకోవాలని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి సూచించారు. సంతోష్‌ ‌భార్య సంతోషికి గ్రూప్‌1 ఉద్యోగ నియామక పత్రం, 4కోట్ల చెక్కు, హైదరాబాద్‌లోని బంజారాహీల్స్‌లో 711గజాలకు సంబంధించిన పత్రాన్ని స్వయంగా అందజేశారు.

సంతోష్‌బాబు తల్లిదండ్రులకు 1కోటి రూపాయలు చెక్కును అందజేశారు. ఆయనతోపాటు రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌, ‌బడుగుల లింగయ్య యాదవ్‌, ‌శాసన మండలి డిప్యూటి చైర్మన్‌ ‌నేతి విద్యాసాగర్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్‌, ‌బొల్లమల్లయ్య యాదవ్‌, ‌శానంపూడి సైదిరెడ్డి, కంచర్ల భూపాల్‌ ‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌, అదనపు కలెక్టర్‌ ‌డి.సంజీవరెడ్డి, జెడ్పిచైర్‌ ‌పర్సన్‌ ‌గుజ్జ దీపికా, డిసిసిబి చైర్మన్‌ ‌గొంగిడి మహేందర్‌ ‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెన పల్లి రవీందర్‌రావు, సూర్యాపేట మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పెరుమాళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌పి.రామాంజుల రెడి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి కల్నల్‌ ‌సంతోష్‌బాబు కుటుంబ పరామర్శ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహయం , గ్రూప్‌1 ఉద్యోగం, 5కోట్ల చెక్కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్వయంగా వారి కుటుంబానికి ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అన్ని పనుల్లో తాను ముందుండి నడిపించారు. హైడ్రోక్లోరైడ్‌ ‌పిచికారి చేయించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా భారి కేడ్లు ఏర్పాటుచేసి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌ ‌నేతృత్వంలో అడిషనల్‌ ఎస్పి 1, డిఎస్పిలు 6గురు, సిఐలు 16మంది, ఎస్సైలు 60మంది, ఏఎస్సై, సిబ్బంది 410మంది, 6రోఫ్‌ ‌పార్టీలు, 4స్పెషల్‌ ‌పార్టీలు, 4బాంబ్‌ ‌స్క్వాడ్‌, 2‌డాగ్‌ ‌స్వ్డాడ్స్, 15‌మహిళా పోలీస్‌ ‌సిబ్బందితో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పర్యటన ముగిసింది. ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన 3.40నిమిషాలకు సంతోష్‌బాబు నివాసానికి చేరుకొని. 4.10నిమిషాలకు తిరిగి రోడ్డు మార్గాన వెళ్లిపోయారు. ఈ పర్యటన మొత్తం 30నిమిషాల్లోనే ముగిసింది.

ఆనందం వ్యక్తం చేసిన కల్నల్‌ ‌సంతోష్‌బాబు కుటుంబం:
ఒక్కగాను ఒక్క కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడని గర్వంగా ఉన్నా కొడుకు లేడనే బాధతో ఉన్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తమ ఇంటికి వచ్చి ఓదార్చడంతో ఎంతో ఆత్మస్థైర్యం కలిగిందని, అలాగే మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తను ముందుండి నడిపిస్తున్నారని, వారు ఇచ్చే ధైర్యమే కొండంత బలమని అన్నారు. సంతోష్‌ ‌బాబు భార్య సంతోషి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్వయంగా తమ నివాసానికి వచ్చి బాధలో ఉన్న మాకు కొండత మనోధైర్యాన్ని కల్పించారని, తమపై ఉంచిన బాధ్యతను తన భర్త ఎలా నిర్వహించారో తాను కూడా అలానే నిర్వహిస్తానని తెలిపారు. మంత్రి జగదీష్‌రెడ్డి ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply