Take a fresh look at your lifestyle.

ములకలపల్లి మండలంలో కలెక్టర్‌ ఆకస్మిక పర్యటన

జిల్లా కలెక్టర్‌ ‌యంవి రెడ్డి శుక్రవారం నాడు ములకలపల్లి మండలంలో ఆనందాపురం , పాతూరు, పూసుగూడెం గ్రామాల్లో విస్తృంతగా పర్యటించారు. ఆనందాపురం గ్రామంలో ఆకస్మిక నిర్వహించి పోయం మధులత ఇంటికెల్లి భగీరధ నీరు వస్తుందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్‌ ‌భగీర నీరు సరఫరాల సాంకేతిక సమస్య ఉన్నందున నీటి సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తెలుపగా ఇంతవరకు తనకు ఈ విషయం ఎందుకు తెలియచేయదేని ఆగ్రహం వ్యక్త్తం చేసారు. తదుపరి తీసుకోవల్సిన చర్యల గురించి తనకు నివేధికలు అందచేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌బియం ద్వారా నిర్మించిన మరుగుదొడ్లపై రంగులతో అందంగా రాయించాలని డార్‌డిఏ పిడికి సూచించారు. అనంతరం సీతారాంపురం పంచాయితీ పరిధిలోని పోతూరు గ్రామంలో చేసిన దాన్యం కనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసారు. నాణ్యత లేని సంచుల్లో దాన్యం నింపి ఉండడాన్ని గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసార••. ఇటువంటి సంచులు ఎవరు సరఫరా చేసారని వివరాలు తనకు అందచేయాలని అన్నారు. రవి అనే రైతు దాన్యాన్ని ఏప్రిల్‌ ‌మాసంలో కేంద్రానికి దాన్యం తెస్తే ఇప్పటివరకు తరలించకుండా జాప్యం చేసారని చెప్పగా రైతులకు ఎందుకు పడిగాపులు కాస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వరంగల్‌ ‌పంపిన దాన్యం దిగుమతి కాకపోవడం వలన జాప్యం జరగిందని అధికారులు చెప్పిన సమధానంపై తనకు ఎందుకు కథలు చెప్తున్నారని ప్రశ్నించారు. రైతు వల్లే మనకు ఆహారం దొరుకుతుందని, ఎందుకు రైతును దగా మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రామంలో క్వారంటైన్‌ ఉన్న వ్యక్తుల వివరాలు నమోదు రిజిష్టరు పరిశీలించిన నమోదులు సమయం తనిఖీ వివరాలు నమోదు చేయకపోవడంపైవైద్యాధికారులపై ఆగ్రహంవ్యక్తం చేసారు. వూక్‌ ‌రమేష్‌ ‌బాబు అనే వ్యక్తి క్వారంటైన్‌లో ఉన్నాడని చెప్పగా తన గృహానికి వెళ్ళి వివరాలును అడిగి తెలుసుకున్నారు. తాను ఉదయం నల్గొండ నుండి లారీలో జూలూరు పాడు మీదుగా వచ్చానని చెప్పాగా చెక్‌పోస్టులో నిర్వహించు సిబ్బంది వీరిని ఎందుకు ఆపలేదని సంబంధిత అధికారుల నుండి విచారణ అందించాలని డిపిఓ, ఆర్‌డిఓలను ఆదేశించారు.

క్వాంరంటైన్‌ ‌పాటించాలని లేనచో ప్రభుత్వ క్వారంటైన్‌కు పంపుతామని అన్నారు. నాణ్యత ప్రమాణాల సక్రమంగా ఉన్న తరువాతనే దాన్యాన్ని మిల్లులకు పంపుతామని మిల్లర్లు ఎందుకు నాణ్యత ప్రమాణాలని చెప్పి రైతును దగా చేస్తున్నారని గతంలో ఇదే సంఘటన జరిగితే విచారణ నిర్వహించి మిల్లరన్లుపై చర్యలు తీసుకోవడానికి కలెక్టర్‌కు ప్రభుత్వానికి నివేధికలు పంపామని చెప్పారు. అవెన్యూ ప్లాంటేషన్‌ ‌కొరకు గ్రామ పంచాయితీకి కావాల్సిన మొక్కల జాబితాను తయారు చేయాలని డిపిఓను ఆదేశించారు. గర్బవతిగా ఉన్న పద్మను ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారా లేదా అంగన్‌వాడీ కేంద్రం నుండి పౌస్టిక ఆహారం అందిస్తున్నారా అని •అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తలు వృద్దాప్య ఫి•ంచను రావడం లేదని చెప్పగా పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులకు ఫించన్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామస్తులు ఉపాధి పనులు కల్పించాలని కోరగా తగు చర్యలు తీసుకోవాలని డిఆర్‌డిఏను ఆదేశించారు. జిల్లాలో అర్హులైన వారు దాదాపు 18వేల మంది కి రేషన్‌ ‌కార్డులు జారీ చేయాలల్సిన వారున్నట్లు నివేధికలు ప్రభత్వానికి పంపామని అనుమతి రాగానే రేషన్‌ ‌కార్డులు జారీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ మధుసూదన్‌రాజు, డిపిఓ ఆశాలత, డిఎస్‌ఓ ‌చంద్రప్రకాష్‌, ‌డియం ప్రసాద్‌, ‌జిల్లా వైద్యాధికారి భాస్కర్‌నాయక్‌, ఆర్‌డిఓ స్వర్ణలత, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ అర్జుణ్‌రావు, తహశీల్దారు , యంపిడిఓ, సర్పంచ్‌లు తది••రులు పాల్గొన్నారు.

Leave a Reply