Take a fresh look at your lifestyle.

దళితవాడసదుపాయాలపై రెండు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలి

వరంగల్‌ అర్బన్‌, ‌జూలై 28, (ప్రజాతంత్ర ప్రతినిధి) : హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో గల దళిత వాడలలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పంచాయతీరాజ్‌,  ‌ట్రాన్స్కో ఇంజనీరింగ్‌ అధికారులు, ఎంపీడీవోలు ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులతో గ్రామంలోని దళిత వాడాలలో మౌళిక వసతుల కల్పన పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ హుజరాబాద్‌ ‌నియోజక వర్గంలోని 139 దళితవాడలు ఉన్నాయని తెలిపారు. హుజరాబాద్‌ ‌నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీలో సంబంధిత గ్రామ సర్పంచ్‌, ‌పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ రాజ్‌ ఏఈ, ‌ట్రాన్స్ ఏఈ, ‌స్థానిక యువకులు, రిటైర్డ్ ఉద్యోగులు, రిసోర్స్ ‌పర్సన్‌లతో కలిసి దళితవాడలను సందర్శించాలని కలెక్టర్‌ ఆదేశిం చారు. దళితవాడలలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ ‌దీపాలు, ఇండ్లపై నుండి వెళ్ళు హెచ్‌టి  విద్యుత్‌ ‌లైన్లు మొదలగు వివరాలను పరిశీలించి రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. దళితవాడలో గల సమస్యలను దళితులను అడిగి తెలుసుకొని రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు. ఒక్క దళితవాడ కూడా విస్మరించకూడదు అని ఆదేశించారు. దళితవాడలో మౌలిక సదుపా యాల కల్పన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయుటకు ఎంపీడీవోలు, మండల స్పెషల్‌ ఆఫీ సర్‌ ‌నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని కలెక్టర్‌ ‌తెలిపారు. అలాగే గ్రామాలలో గల దళితుల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ బృందా లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మిషన్‌ ‌భగీరథ ద్వారా అన్ని దళితవాడలకు   త్రాగునీరు సరఫరా సరఫరాపై వేరుగా బృందాలను పంపిస్తున్నామని కలెక్టర్‌ ‌తెలిపారు.
వరంగల్‌ అర్బన్‌ ‌కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ హుజురా బాద్‌ ‌నియోజకవర్గంలోని అన్ని దళితవాడలలో మౌలిక సదుపాయాలు కల్పించుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దళితవాడలో గల ఇతర సమస్యలను అడిగి తెలుసుకుని నివేదిక సమర్పించాలని అన్నారు.  దళితవాడలకు రవాణా సౌకర్యం ఉన్నది లేనిది, రేషన్‌ ‌కార్డులు, ఆసరా పింఛన్లు గ్రామ కంఠం భూముల లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మొదలగు అన్ని సమస్యలను దళితుల నుండి తెలుసుకొని రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు
పంచాయతీరాజ్‌ ఇం‌జనీరింగ్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌సంజీవ రావు మాట్లాడుతూ  హుజరాబాద్‌ ‌నియోజకవర్గంలోని ప్రతి  గ్రామ పంచాయతీకి ఒక ఏఈ, 2-3 గ్రామ పంచాయతీలకు ఒక డిఈ, మండలానికి ఒక  ఈఈ ని దళితవాడ లలో మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం కోసం నియమిం చామని తెలిపారు. సంబంధిత ఇంజనీర్లు సంబంధిత గ్రామ సర్పంచ్‌ ‌సెక్రెటరీలతో కలిసి  దళితవాడలలో సిసి రోడ్లు ఉన్నవా లేవా డ్రైనేజీ లు, స్ట్రీట్‌ ‌లైట్‌ ‌లు ఉన్నవి లేనివి పరిశీలించి అవసరమైన సిసి రోడ్లు డ్రైనేజీలు సైడ్‌ ‌కమ్యూనిటీ హాల్‌ ‌నిర్మాణానికి రెండు రోజుల్లో అంచనాలు తయారు తయారుచేసి సమర్పించాలని ఆదేశించారు ఇంజనీర్లను ఆదేశించారు.
ఎన్‌పిడిసిఎల్‌ ‌చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌మోహ న్‌ ‌రావు మాట్లాడుతూ దళితవాడలలో ప్రతి ఇంటికి విద్యుత్‌ ‌కలెక్షన్‌ ఉన్నది లేనిది పరిశీలించి నివేదిక సమర్పించాలని అన్నారు. దళితవాడలో 100 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ ‌సరఫరా చేస్తుందని దళితవాడలలో విద్యుత్‌ ‌వివరాలు సమర్పించాలని అన్నారు. దళితవాడలో అదనపు విద్యుత్‌ ‌స్తంభాలు అవసరం ఉన్న వాటిని గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాల న్నారు. ఈ సమావేశంలో లోకల్‌ ‌బాడీస్‌ అదనపు కలెక్టర్‌ ‌గరిమ అగర్వాల్‌, ‌ట్రైని కలెక్టర్‌ ‌మయాంక్‌ ‌మిట్టల్‌, ‌జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, పంచాయతీరాజ్‌ ‌ట్రాన్స్కో ఇంజనీర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply